కోవిడ్ పై పోరులో నేనూ, ఢిల్లీలో గురుద్వారాకు రూ. 2 కోట్లు విరాళమిచ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ

కోవిడ్ పై పోరులో నేను కూడా ఉంటానని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. ఢిల్లీలోని రకబ్ గంజ్ గురుద్వారాను కోవిడ్ కేంద్రంగా మార్చిన నేపథ్యంలో దీనికి ఆయన రూ. 2 కోట్లు విరాళమిచ్చారు.

  • Publish Date - 9:27 pm, Sun, 9 May 21 Edited By: Phani CH
కోవిడ్ పై పోరులో నేనూ,   ఢిల్లీలో గురుద్వారాకు రూ. 2 కోట్లు విరాళమిచ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ
Amitab Bachchan

కోవిడ్ పై పోరులో నేను కూడా ఉంటానని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. ఢిల్లీలోని రకబ్ గంజ్ గురుద్వారాను కోవిడ్ కేంద్రంగా మార్చిన నేపథ్యంలో దీనికి ఆయన రూ. 2 కోట్లు విరాళమిచ్చారు. 300 పడకలు గల ఈ కేంద్రం రేపటి నుంచి ప్రారంభం కానుందని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ ప్రెసిడెంట్ మంజీన్దర్ సింగ్ సిర్సా తెలిపారు.ఈయన ఆకాలీదళ్ జాతీయ అధికార ప్రతినిధి కూడా. ఈ కేంద్రానికి విదేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు ఇతర వైద్య పరికరాలను కూడా తెప్పిస్తానని అమితాబ్ బచ్చన్ హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఈ కోవిడ్ సెంటర్లో పని చేయడానికి అనేకమంది డాక్టర్లు, నర్సులు ఇతర వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. కాగా బిగ్ బీ ప్రతి రోజూ ఫోన్ చేసి ఇంకా ఈ కేంద్రానికి అవసరమైనసదుపాయాలను సమకూర్చుతానని చెప్పారని ఆయన పేర్కొన్నారు. బిగ్ బీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బాలీవుడ్ స్టార్లలో చాలామంది కోవిడ్ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. వివిధ రకాలుగా సాయం చేస్తున్నారు. సోను సూద్, అక్షయ్ కుమార్ ఇలా పలువురు ముందుకు వస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ట్రీట్‏మెంట్ అందితే బ్రతుకుతాను.. ఆక్సిజన్ బెడ్ ఉంటే హెల్ప్ చేయండంటూ నటుడి పోస్ట్.. కానీ అంతలోనే..

జామాకులతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. వేసవిలో చర్మ సమస్యలను క్షణాల్లో తగ్గించే ఔషదమే జామ..