Pahalgam Terror Attack: పహల్గామ్ అటాక్ ఎఫెక్ట్.. పాక్ నటుడి సినిమాకు యూట్యూబ్ బిగ్ షాక్
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ నటీనటుల సినిమాలను నిషేధించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కూడా దీనిపై ఓ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఇండియా కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

పాకిస్తానీ నటుడు ఫహద్ ఖాన్ నటించిన ‘అభిర్ గులాల్’ సినిమా విడుదల చేయవద్దన్న డిమాండ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పహల్గామ్ దాడి తర్వాత ఈ బాలీవుడ్ చిత్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే ‘అబీర్ గులాల్’ సినిమా విడుదలకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ అనుమతి నిరాకరించినట్లు సమాచారం. వివాదాస్పద చిత్రం ‘అభిర్ గులాల్’ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో పాక్ నటుడు ఫహద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. వాణి కపూర్ హీరోయిన్. ఈ చిత్రానికి ఆర్తి ఎస్ బాగ్డి దర్శకత్వం వహించారు. ఫహద్ ఖాన్ తప్ప, ఈ సినిమాలో నటించి, పనిచేసిన ప్రతి ఒక్కరూ భారతీయులే. కానీ ఇప్పుడు ఈ సినిమాలో పాకిస్తానీ నటుడు ఫహద్ ఖాన్ నటించడం వల్ల సమస్య తలెత్తింది. ఇప్పుడీ సినిమాకు మరో బిగ్ షాక్ తగిలింది. ‘అభిర్ గులాల్’ చిత్రంలోని కొన్ని పాటలు గతంలో యూట్యూబ్‌లో విడుదలయ్యాయి. వీటికి మంచి స్పందన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు యూట్యూబ్ ‘అభిర్ గులాల్’ సినిమాలోని పాటలను తొలగించింది. పహల్గామ్ దాడికి నిరసనగా యూట్యూబ్ ఇండియా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే భారతదేశంలో మాత్రమే ‘అభిర్ గులాల్’ చిత్రంలోని పాటలు యూట్యూబ్‌లో వినడానికి అందుబాటులో ఉండవు.
అభిర్ గులాల్’ సినిమాలోని రెండు పాటలు యూట్యూబ్‌లో ఉన్నాయి. వాటిలో ఒకటి రొమాంటిక్ సాంగ్, మరొకటి పార్టీ డ్యాన్స్ సాంగ్. రెండు పాటలకు కూడా మంచి వ్యూస్ వచ్చాయి. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఇండియా రెండు పాటలను యూట్యూబ్ నుంచి తొలగించింది. దీని వల్ల చిత్ర బృందానికి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.
Film Abir Gulaal blocked by MIB. The Film Federation also denied the release of this film.
Why, now?
Not because the lead actor is a Pakistani.
Because we needed one terrorist attack to remind us that the lead actor is a Pakistani. pic.twitter.com/9kJ8J9q3Dr
— The Hawk Eye (@thehawkeyex) April 24, 2025
కొన్ని నెలల క్రితమే, పాకిస్తాన్‌లో నిర్మించిన ‘మౌలా జట్’ సినిమా భారతదేశంలో విడుదలైంది. ఈ చిత్రంలో ఫహద్ ఖాన్, మహీరా ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘మౌలా జట్’ చిత్రం చాలా సంవత్సరాల తర్వాత భారతదేశంలో విడుదలైన మొదటి పాక్ చిత్రంగా గుర్తింపు పొందింది. అయితే పహల్గామ్ దాడి తర్వాత ఇప్పుడు పాక్ సినిమాలు, నటీనటులకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








