AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terror Attack: ‘నా రక్తం మరిగిపోతోంది.. పాక్‌పై యుద్ధం ప్రకటించాల్సిందే’: స్టార్ హీరోయిన్ సోదరి

జమ్మూ కశ్వీర్ లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ అయిన స్టార్ హీరోయిన్ సోదరి ఈ ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించింది.

Pahalgam Terror Attack: 'నా రక్తం మరిగిపోతోంది.. పాక్‌పై యుద్ధం ప్రకటించాల్సిందే': స్టార్ హీరోయిన్ సోదరి
Pahalgam Terror Attack
Basha Shek
|

Updated on: Apr 25, 2025 | 12:11 PM

Share

పహల్గామ్ దాడి యావత్ భారత్ దేశాన్ని తీవ్రంగా కలచి వేసింది. మరీ ముఖ్యంగా ఈ ఉగ్ర దాడి వెనక పాక్ హస్తం ఉండొచ్చన్న ఇంటెలిజెన్స్ నివేదికలు భారతీయులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఎలాగైనా పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవలే నవజాత శిశువు ప్రాణాలను కాపాడి వార్తల్లో నిలిచిన బాలీవుడ్ నటి దిశా పటాని సోదరి ఖుష్బూ పటానీ కూడా ఇదే డిమాండ్ చేస్తోంది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది ఖుష్బూ పటానీ. ‘పహల్గామ్‌లో ఏమి జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు నా రక్తం మరిగిపోతోంది. ఇది కేవలం ఉగ్రవాద దాడి కాదు. ఇందులో పాకిస్తాన్ పాత్ర కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గత 75 సంవత్సరాలుగా, మేం పాకిస్తానీలను సహిస్తున్నాము. ప్రేమ, శాంతి అంటూ చేతులు కట్టుకుని కూర్చున్నాం. వారు హిందువులను దారుణంగా చంపారు. ఇది నన్నెంతో కలచి వేస్తోంది. ఇక పాక్ పని పట్టాల్సిన సమయం వచ్చింది. భారత సైన్యంలో మాజీ మేజర్‌గా, మనకు మంచి సైన్యం ఉందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం మనకు 15 లక్షల మందికి పైగా సైనికులు ఉన్నారు. అందుకే వెంటనే పాక్ పై యుద్ధం ప్రకటించాలి. దీని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు’

‘మన భారత సైన్యం చాలా బలంగా ఉంది. సైనికులు ఆదేశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. దీనిని తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే పాక్ ఏకైక లక్ష్యం జిహాద్ చేయడమే. వారు భారతీయులను అసలు ఇష్టపడరు. అయినా ఏ మతంలో చెప్పారు? ఇలాఅమాయకులను చంపవచ్చని. ఏ పుక్తకంలో రాశారు ఇలా మారణకాండ చేయాలని. పాకిస్తాన్‌పై మన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుందని విని నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ ఉగ్రవాదులందరూ త్వరలోనే వారి చర్యల పర్యవసానాలను ఎదుర్కొంటారని ఆశిస్తున్నాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతీయులందరూ ఐక్యంగా ఉండాలి. శాంతి, సామరస్యాన్ని పెంపొందించేలా మన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు హృదయపూర్వకంగా మద్దతు ఇవ్వాల్సిన సమయం ఇది. మనమందరం కలిసి పనిచేద్దాం’ అని వీడియోలో చెప్పుకొచ్చారు ఖుష్బూ పటానీ.

ఇవి కూడా చదవండి

దిశా పటానీ సోదరి కామెంట్స్.. వీడియో..

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ అభిమానులు, నెటిజన్లు ఖుష్బూ మాటలకు మద్దతు పలుకుతున్నారు.

ఆర్మీ డ్రెస్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.