AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Chopra: అందంగా కనిపించేందుకు ముక్కుకు సర్జరీ చేయించుకున్న హీరోయిన్.. కట్ చేస్తే.. నిస్సహాయురాలిగా అలా..

తన ముక్కు సర్జరీ ఫెయిల్ అయ్యి.. తన ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని తెలిపింది. దీంతో ఆమె చాలా భయపడిపోయానని.. ఆ సమయంలో నిస్సహాయురాలిగా ఉండిపోయానని తెలిపింది.

Priyanka Chopra: అందంగా కనిపించేందుకు ముక్కుకు సర్జరీ చేయించుకున్న హీరోయిన్.. కట్ చేస్తే.. నిస్సహాయురాలిగా అలా..
Priyanka Chopra
Rajitha Chanti
|

Updated on: Mar 10, 2023 | 7:30 AM

Share

సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‏గా రాణించాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు. అందం కూడా ముఖ్యమే. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అందంగా ఉండాల్సిందే. సినీ తారల స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్, రూపం పై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. తమ ముఖం మరింత అందంగా.. ఆకర్షణీయంగా కనిపించేందుకు పలువురు ముద్దుగుమ్మ సర్జరీలు కూడా చేయించుకున్నారు. అలా అందం కోసం సర్జరీ బాట పట్టినవారిలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఒకరు. మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు ఆమె తన ముక్కుకు సర్జరీ చేయించుకుందట. ఈ విషయాన్ని తన ఆత్మకథ అన్‏ఫినిష్డ్ లో రాసుకొచ్చింది. అయితే తన ముక్కు సర్జరీ ఫెయిల్ అయ్యి.. తన ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని తెలిపింది. దీంతో ఆమె చాలా భయపడిపోయానని.. ఆ సమయంలో నిస్సహాయురాలిగా ఉండిపోయానని తెలిపింది.

“నా ముక్కుకు సర్జరీ చేసే సమయంలో డాక్టర్ ఆసక్తిని కోల్పోయాడు. దీంతో నా ముక్కు ఆకారమే మారిపోయింది. బ్యాండేజీ తొలగించగానే నా ముక్కు చూసి అమ్మ.. నేను భయపడిపోయాము. అది వంకరగా మారిపోయి నా ముఖమే మరోలా కనిపించింది. అసలు నేను నాలాగే లేను. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు వేరే ఎవరో నన్ను చూస్తున్నట్లుండేది. ఆ సమయంలో నేను నిస్సహాయురాలిగా ఉండిపోయాను. నా ఆత్మగౌరవం తగ్గిపోయినట్లు అయ్యింది. తిరిగి మళ్లీ మాములు మనిషిగా కోలుకుంటాను అనుకోలేదు” అంటూ రాసుకొచ్చింది.

ప్రియాంక ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఆమె అందం కోసం సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వచ్చాయి. అయితే సర్జరీ సక్సెస్ కాకపోవడంతో అందవిహీనంగా మారిందని..దీంతో తన ముక్కును సాధారణ స్థితికి తెచ్చుకునేందుకు మళ్లీ సర్జరీలు చేయించుకుందట. కేవలం ప్రియాంక చోప్రా మాత్రమే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శర్మ కూడా సర్జరీ చేయించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే