Malaika Arora Father: అంతకష్టం ఏమోచ్చిందో ఏంటో.. బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి బలవన్మరణం..

బాలీవుడ్‌ హీరోయిన్, మోడల్ మలైకా అరోరా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అనిల్‌ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన నివాసం టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

Malaika Arora Father: అంతకష్టం ఏమోచ్చిందో ఏంటో.. బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి బలవన్మరణం..
Malaika Arora Father Kills self
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 11, 2024 | 1:04 PM

బాలీవుడ్‌ హీరోయిన్, మోడల్ మలైకా అరోరా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అనిల్‌ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన నివాసం టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే.. అనిల్‌ అరోరా తాను బస చేసిన బాంద్రాలోని భవనం టెర్రస్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. అనిల్ అరోరా రిటైర్డ్ మర్చంట్ నేవీ ఉద్యోగి… అరోరా ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పేర్కొంటున్నారు. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వీడియో చూడండి..

మలైకా 11 సంవత్సరాల వయస్సులో ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మలైకా అరోరా ఆమె తల్లి జాయిస్ పాలికార్ప్‌తో పాటు ఆమె సోదరి అమృతా అరోరాతో కలిసి నివసించారు.

అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ ఘటనా స్థలికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.