Jacqueline Fernandez: మీ సొంతవారికి ఇలా చేయరని అనుకుంటున్నాను.. మీడియాను అభ్యర్థించిన హీరోయిన్..

గత కొద్ది రోజులుగా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్

Jacqueline Fernandez: మీ సొంతవారికి ఇలా చేయరని అనుకుంటున్నాను.. మీడియాను అభ్యర్థించిన హీరోయిన్..
Jacqueline Fernandez
Follow us

|

Updated on: Jan 09, 2022 | 9:53 AM

గత కొద్ది రోజులుగా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఆరోపణలు ఎదుర్కోంటుంది. దాదాపు రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందుకు ఇప్పటివరకు మూడు సార్లు జాక్వెలిన్ తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. దీంతో జాక్వెలిన్ పేరు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆమె సుకేష్ చంద్రశేఖర్‏తో కలిసి దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో జాక్వెలిన్ మీడియాకు అభ్యర్థిస్తూ తన ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసింది. సుకేష్ చంద్రశేఖర్ తో లీక్ అయిన తన ఫోటోలను ప్రసారం చేయొద్దని మీడియాను కోరింది.. తన గోప్యతకు భంగం కలిగిస్తోంది జాక్వెలిన్ పేర్కొంది.

జాక్వెలిన్ ఇన్ స్టా ఖాతాలో “ఈ దేశం ప్రజలు ఎప్పుడూ నాకు విపరీతమైన ప్రేమ, గౌరవాన్ని ఇచ్చారు. నాకు మీడియా సన్నిహితులు ఉన్నారు. వారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను ప్రస్తుతం కఠినమైన పరిస్థితులలో ఉన్నాను. కానీ నా స్నేహితులు అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నా అభిమానులు కూడా నన్ను చూస్తారు. నా గోప్యత, వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే ఫోటోలను ప్రసారం చేయవద్దని నేను మీడియా మిత్రులను అభ్యర్థిస్తున్నాను. మీరు మీ సొంత ప్రియమైన వారికి ఇలా చేయరు. మీకు నాకు కూడా ఇలా చేయరని అనుకుంటున్నాను. న్యాయం, చిత్తశుద్ది గెలుస్తుందని ఆశిస్తున్నాను. ధన్యావాదాలు ” అంటూ చెప్పుకొచ్చింది జాక్వెలిన్.

Also Read: Bangarraju: ‘బంగారు’ లిరికల్ వీడియో రిలీజ్.. ఇరగదీసిన నాగ చైతన్య, కృతి జోడీ..!

RameshBabu Passed Away: ఆయన మృతి మాకు తీరని లోటు.. కొవిడ్ నిబంధనలతో అంతక్రియలు: ఘట్టమనేని కుటుంబం

Ramesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం.. ఆయన సోదరుడు కన్నుమూత..!