Vijay Varma-Tamannaah: తమన్నాతో పెళ్లి ఎప్పుడు ?.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు విజయ్ వర్మ..
వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ నటించారు. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరు కలిసి సినిమా షోలలో, ఈవెంట్లలో పాల్గొన్నారు. గతంలో తమ ప్రేమ విషయాన్ని ధృవీకరించారు. కానీ పెళ్లి విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా విజయ్ వర్మ తమన్నాతో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల విజయ్ వర్మ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే అక్కడున్న అభిమానులు పెళ్లి గురించి అడిగారు. విజయ్ వర్మ మాట్లాడుతూ..

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, హీరోయిన్ తమన్నా భాటియా కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ నటించారు. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరు కలిసి సినిమా షోలలో, ఈవెంట్లలో పాల్గొన్నారు. గతంలో తమ ప్రేమ విషయాన్ని ధృవీకరించారు. కానీ పెళ్లి విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా విజయ్ వర్మ తమన్నాతో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల విజయ్ వర్మ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే అక్కడున్న అభిమానులు పెళ్లి గురించి అడిగారు. విజయ్ వర్మ మాట్లాడుతూ.. “ఈ ప్రశ్నకు సమాధానం మా అమ్మకి కూడా చెప్పలేను.. కాబట్టి ఇప్పుడు మీకు కూడా సమాధానం చెప్పలేను” అంటూ చెప్పుకొచ్చారు. “పెళ్లి అనేది చేసుకోవాలని అనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటాను. అది పెద్ద బాధ్యత. పార్టీ కాదు.. ఎంతో ఆలోచించాలి. ఆ బాధ్యతకు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటాను” అని అన్నారు. దీంతో విజయ్ వర్మ మాటలపై అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు తమన్నా, విజయ్ పెళ్లి ఎప్పుడూ చేసుకుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు చెందిన ఏ అమ్మాయితో లేదా ఎవరితోనైనా పెళ్లి చేసుకోవద్దని అనుకున్నానని.. కానీ తమన్నాతో పరిచయం ఏర్పడిన తర్వాత.. నటన, ఆలోచన, లాజిస్టిక్స్, ఫైనాన్స్, సినీ పరిశ్రమలో అన్ని విషయాలను అర్థం చేసుకున్న వ్యక్తి కావడం చాలా ముఖ్యమైన విషయమని తెలుసుకున్నాను. తమన్నా మంచి నటి.. తెలివైన అమ్మాయి. నా సినీ ప్రయాణంలో ఆమె నన్ను ప్రోత్సహిస్తుంది. అలాగే సలహాలు ఇస్తుందంటూ చెప్పుకొచ్చారు.
View this post on Instagram
విజయ్ వర్మ, తమన్నా కలిసి లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. తన సహనటుడితో ప్రేమలో పడతానని ఊహించలేదని తమన్నా గతంలో తెలిపింది. ఇక విజయ్ మారకుండా తనని అలాగే యాక్సెప్ట్ చేశాను అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. విజయ్ నా హ్యాపీ ప్లేస్ అని గర్వంగా చెప్పింది తమన్నా. రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఇప్పటివరకు ఎలాంటి గాసిప్, డేటింగ్ రూమర్స్ రాకుండా ఉన్న హీరోయిన్ తమన్నా.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.