Akhil Mishra: కిచెన్‌లో జారిపడి ప్రముఖ నటుడి హఠాన్మరణం.. షాక్‌లో సినిమా ఇండస్ట్రీ

|

Sep 21, 2023 | 5:18 PM

సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఆమిర్‌ ఖాన్ '3 ఇడియట్స్', 'దిల్ చాహ్తా హై' సహా పలు సినిమాల్లో నటించిన అఖిల్ మిశ్రా ఓ ప్రమాదంలో హఠాన్మరణం పాలయ్యారు. ఆయన వయసు సుమారు 58 సంవత్సరాలు. ఇటీవల తన నివాసంలోని వంటగదిలో టేబుల్‌పై నిలబడి పని చేస్తుండగా పట్టుతప్పి కింద పడిపోయారు. ఈప్రమాదంలో తలకు బలమైన గాయం కావడం, తీవ్ర రక్తస్రావం కావడంతో అఖిల్‌ కన్నుమూశారు.

Akhil Mishra: కిచెన్‌లో జారిపడి ప్రముఖ నటుడి హఠాన్మరణం.. షాక్‌లో సినిమా ఇండస్ట్రీ
Akhil Mishra
Follow us on

సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఆమిర్‌ ఖాన్ ‘3 ఇడియట్స్’, ‘దిల్ చాహ్తా హై’ సహా పలు సినిమాల్లో నటించిన అఖిల్ మిశ్రా ఓ ప్రమాదంలో హఠాన్మరణం పాలయ్యారు. ఆయన వయసు సుమారు 58 సంవత్సరాలు. ఇటీవల తన నివాసంలోని వంటగదిలో టేబుల్‌పై నిలబడి పని చేస్తుండగా పట్టుతప్పి కింద పడిపోయారు. ఈప్రమాదంలో తలకు బలమైన గాయం కావడం, తీవ్ర రక్తస్రావం కావడంతో అఖిల్‌ కన్నుమూశారు. అఖిల్ స్నేహితుల్లో ఒకరు మీడియాకు ఇచ్చిన కథనం ప్రకారం.. రక్తపు మడుగులో పడి ఉన్న అఖిల్‌ను ఇరుగుపొరుగు వారు గమనించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూనే అఖిల్ మృతి చెందారు. అఖిల్ టేబుల్ మీద నుంచి పడిపోయిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఆయన భార్య కూడా షూటింగ్‌లో బిజీగా ఉంది. అఖిల్ రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లు అతని బంధువులు మీడియాకు తెలిపారు. ఇక అఖిల్‌ మరణాన్ని ఆయన భార్య సుజానే బెర్నెర్ట్ ధ్రువీకరించింది.’నా గుండె పగిలిపోయింది, నాలో సగం కోల్పోయాను’ అంటూ సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్టును షేర్‌ చేసిందామె. దీంతో పలువురు సినీ ప్రముఖులు అఖిల్‌ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ పోస్టులు పెడుతున్నారు.

 

ఇవి కూడా చదవండి

అఖిల్ మిశ్రా చాలా ఏళ్లుగా హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ‘డాన్’, ‘గాంధీ మై ఫాదర్’, అమీర్ ఖాన్ ‘దిల్ చాహ్తా హై’, ‘వెల్ డన్ అబ్బా’, ‘కలకత్తా మెయిల్’ మరియు మరెన్నో సినిమాల్లో నటించారు. ‘3 ఇడియట్స్‌’ సినిమాలో లైబ్రేరియన్‌ దూబేగా ఆయన చేసిన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలే కాకుండా ‘శ్రీమాన్ శ్రీమతి’, ‘పర్దేస్ మే మిలా కోయి అప్నా’, ‘దో దిల్ బంధే ఏక్ దోరీ సే’ వంటి సీరియల్స్‌లోనూ అఖిల్‌ నటించారు. ఇక 2009లో అఖిల్ జర్మనీకి చెందిన నటి సుజానే బెర్నెర్ట్‌ను వివాహం చేసుకున్నారు. సుజానే బెర్నెర్ట్ 2006 నుండి హిందీ సినిమాలు, సీరియల్స్ లో నటిస్తోంది. ‘కసౌతీ జిందగీ కి’, ‘ఝాన్సీ కి రాణి’, ‘సిఐడి’, ‘అశోక సామ్రాట్’, ‘హజారోమే మేరీ బెహనా హై’, ‘యే రిష్తా క్యా కెహలతా హై’ వంటి పలు హిందీ సీరియల్స్‌లో సుజానే నటించింది. కాగా అఖిల్ మిశ్రా గతంలో యాక్టింగ్‌లో చాలామందికి శిక్షణ కూడా ఇచ్చారు.

భార్యతో అఖిల్ మిశ్రా..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.