AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తమ్ముడితో రాఖీ సెలబ్రెషన్స్ చేసుకుంటున్న ఈ చిన్నారిని గుర్తుపట్టండి.. బాలీవుడ్ స్టార్ హీరో కూతురు..

పైన ఫోటోను చూశారు కదా.. అందులోని ఇద్దరు చిన్నారులను చూస్తే వారి తల్లిదండ్రులను చూసినట్టే. అంతగా పేరెంట్స్ పోలికలు ఎక్కువగా ఉంటాయి. తన తమ్ముడితో కలిసి కూర్చుని రాఖీ సెలబ్రెషన్స్ జరుపుకుంటున్న ఆ చిన్నారి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. గుర్తుపట్టారా ?.. మరోవైపు ఆ చిన్నారి తండ్రి పాన్ ఇండియా లెవల్లో వరుస చిత్రాల్లో నటిస్తున్నారు.

Tollywood: తమ్ముడితో రాఖీ సెలబ్రెషన్స్ చేసుకుంటున్న ఈ చిన్నారిని గుర్తుపట్టండి.. బాలీవుడ్ స్టార్ హీరో కూతురు..
Bollywood Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 21, 2023 | 8:26 PM

సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్స్ వారసులు ఇప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోహీరోయిన్స్ కూతుర్లు, కుమారులు వెండితెరపై సందడి చేస్తున్నారు. తమ సహజ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ తమకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే కొందరు మాత్రం తమ తల్లిదండ్రుల పోలికలకు దగ్గరగా ఉంటారు. అనుక్షణం వారు తమ పేరెంట్స్ ను గుర్తుచేస్తారు. పైన ఫోటోను చూశారు కదా.. అందులోని ఇద్దరు చిన్నారులను చూస్తే వారి తల్లిదండ్రులను చూసినట్టే. అంతగా పేరెంట్స్ పోలికలు ఎక్కువగా ఉంటాయి. తన తమ్ముడితో కలిసి కూర్చుని రాఖీ సెలబ్రెషన్స్ జరుపుకుంటున్న ఆ చిన్నారి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. గుర్తుపట్టారా ?.. మరోవైపు ఆ చిన్నారి తండ్రి పాన్ ఇండియా లెవల్లో వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. తనే హీరోయిన్ సారా అలీ ఖాన్.

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, అతని మొదటి భార్య అమృతా సింగ్‌ల పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీం ఖాన్. సైఫ్ సోదరి సబా పటౌడీ ఈ త్రోబాక్ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. సారా అలీ ఖాన్ ప్రస్తుత లుక్ అమృత చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని కామెంట్ చేశారు. ‘కేదార్‌నాథ్’ సినిమాతో తెరంగేట్రం చేసింది సారా అలీ ఖాన్. ఇందులో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించారు. తొలి చిత్రానికే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో నటించింది సారా.

లవ్ ఆజ్ కల్, కూలీ నంబర్ వన్ చిత్రాలతో హిట్స్ అందుకుంది. ఇక సారా సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ విషయానికి వస్తే.. నటుడిగా కాదు.. దర్శకుడిగా మారేందుకు అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ, సర్జమీన్ , తాషన్ వంటి చిత్రాలలో సహాయ దర్శకుడిగా పనిచేశాడు.

View this post on Instagram

A post shared by Saba Pataudi (@sabapataudi)

సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ ఇద్దరూ 1991లో ‘బేకుడి’ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అదే ఏడాది వీరిద్దరు వివాహం చేసుకున్నారు. 2004లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 2012 లో కరీనా కపూర్‌ను వివాహం చేసుకున్నాడు సైఫ్. వీరికి తైమూర్, జె ఇద్దరు అబ్బాయిలు జన్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.