Pardes Movie: ఎన్నారై సంబంధంలో కష్టాలను ఆవిష్కరిస్తూ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన పరదేశ్ మూవీకి నేటితో 25 ఏళ్ళు పూర్తి ..
అలాంటి సినిమాలో ఒకటి బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పరదేశ్.. ఈ సినిమా నేటితో 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. బాలీవుడ్ సుప్రసిద్ధ దర్శకుడు సుభాష్ ఘాయ్ 1997లో తెరకెక్కిన పరదేశ్ 8 ఆగస్ట్ 1997న రిలీజయింది.
Pardes Movie: సినిమాకు పనిలేదు.. మనసుని తాకే కథ, ఆకట్టుకునే సంగీతం.. కనులకు విందు చేసే ఫొటోగ్రఫీ ఉంటె చాలు అని అనేక సినిమాలు నిరూపిస్తూనే ఉన్నాయి. ఏడాది ఎన్ని వందల సినిమాలు నిర్మించినా.. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాయి. కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతాయి. ఎన్ని ఏళ్ళు గడిచినా ఆ సినిమా తాలూకా ఫ్లేవర్ అభిమానులను వదలదు. అలాంటి సినిమాలో ఒకటి బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పరదేశ్.. ఈ సినిమా నేటితో 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. బాలీవుడ్ సుప్రసిద్ధ దర్శకుడు సుభాష్ ఘాయ్ 1997లో తెరకెక్కిన పరదేశ్ 8 ఆగస్ట్ 1997న రిలీజయింది. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ అర్జున్ సాగర్ పాత్రలో జీవించాడు. ఈ సినిమాతో హీరోయిన్ గా మహిమా చౌదరి వెండి తెరపై అడుగు పెట్టింది. ప్రధాన పాత్రలో అపూర్వ అగ్నిహోత్రి రాజీవ్ పాత్రను పోషించారు. అమ్రిష్ పూరి, అలోక్ నాథ్, దీనా పాఠక్, హిమానీ శివపురి, ఆదిత్య నారాయణ్ వంటి నటీనటులు నటించారు. ఈ సినిమాలో ఎన్నటికీ గుర్తిండిపోయేవిధంగా నటీనటులు నటించారు.
జ్ఞాపకాలను పంచుకున్న సుభాష్ ఘయ్ పరదేశ్, రామ్ లఖన్, హీరో, కర్జ్, తాళ్, అప్నా సప్నా మనీ మనీ, కర్మ , ఓం శాంతి ఓం వంటి అందమైన చిత్రాలను అందించిన సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించిన చిత్రం పరదేశ్ మూవీ గురించి మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో చర్చ జరుగుతోంది. చిత్ర ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ పరదేశ్ సినిమా కోసం పాత్రల ఎంపిక, షూటింగ్ సమయంలో తాను తీసుకున్న జాగ్రత్తలు పంచుకున్నాడు. సిల్వర్ జూబ్లీని జరుపుకుంటూ యువత, కుటుంబ సభ్యులకు అత్యంత ఇష్టమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది అని చెప్పారు.
సుభాష్ ఘాయ్ మాట్లాడుతూ ”రచయితగా, దర్శకుడిగా నా మొదటి దృష్టి క్యారెక్టరైజేషన్ పైనే. ఈ పాత్రలు కథను చక్కగా వివరిస్తాయి. మంచి కథ రాయడం చాలా కష్టం. స్క్రీన్‌ప్లే రాయడం అంతకంటే కష్టం. మరింత కష్టం.. అక్షరాలకు రంగుని అద్దె కార్యక్రమం అని చెప్పారు.
కథ రాయడానికి ఒక సూత్రం ఉంది.. మొదట పాత్రలు.. అందుకు అనుగుణంగా కథ రాయాలి.. అనంతరం ఆ కథకు తగిన తారలు సరిపోయేలా ఎంపిక అని చెప్పారు. స్టార్‌ని చూసి నేనెప్పుడూ క్యారెక్టర్ రాయలేదు. ఫలానా క్యారెక్టర్ స్టార్‌కి సరిపోతారా లేదా అని తాను జడ్జ్ చేస్తానని చెప్పారు. అనంతరం కథకు అనుగుణంగా నటీనటుల ఎంపికను ఫైనల్ చేస్తానని చెప్పారు.
సినిమాలోని ప్రధాన పాత్ర అయిన అర్జున్ సాగర్ ని గుర్తు.. షారుఖ్ ఖాన్ ఎంపిక విషయాన్నీ పంచుకున్నారు. నటీనటుల ఎంపికలో భాగంగా తాను షారుక్‌ని పిలిచినప్పుడు, నేను అతనికి ఒకే ఒక్క విషయం చెప్పాను.. ఈ చిత్రంలో షారుఖ్ గా ఉండొద్దు.. పాత్రకి అనుగుణంగా మొదటి నుంచి చివరి సన్నివేశం వరకూ ఒక ప్రేమికుడు మాత్రమే కనిపించాలని చెప్పను.. అలా మీరు ప్రేమను చూపించకపోతే.. కథ మొత్తం మారిపోతుందని షారుక్ కి చెప్పినట్లు సుభాష్ చెప్పారు.
షారుఖ్ ఖాన్ నుండి బయటకు బయటకు వచ్చి.. ప్రేమికుడైన అర్జున్ బయటపడడానికి చాలా కష్టపడ్డాడు. చాలా పరిణతి చెందిన నటన ప్రదర్శించాడు. జీన్స్‌కు బదులుగా పాత్రకు అనుగుణంగా ప్యాంటు ధరించి సరికొత్త లుక్ లో కనిపించాడు. సినిమాలో మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఈ చిత్రంలో షారుఖ్ నటన అతని అన్ని చిత్రాల కంటే ప్రత్యేకంగా నిలిచింది. అభిమానులకు సరికొత్త షారుఖ్ ని పరిచయం చేసింది పరదేశి. ఇక హీరోయిన్ మహిమా చౌదరి అందం అప్పటికో కుర్రకారు మదిని దోచేసింది.