shahrukh khan : బాలీవుడ్ బాద్షా షారుఖాన్ కోసం ఎదురుచూస్తున్న తమిళ్ స్టార్ డైరెక్టర్..
ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన బాద్ షా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఐకాన్.. షారుఖ్ ఖాన్ కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది.
shahrukh khan : ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన బాద్ షా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఐకాన్.. షారుఖ్ ఖాన్ కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. గత కొంతకాలంగా వరుసగా ఫ్లాప్ లు వచ్చిపడుతున్నాయి. ఇక పఠాన్ పైనే ఆయన ఆశలన్నీ. బాలీవుడ్ పైనే కాకుండా.. సౌత్ పై కూడా ఇంట్రెస్ట్ చూపించే షారూఖ్.. ఓ కోలీవుడ్ డైరెక్టర్ తో మూవీ చేసేందుకు రెడీ అంటున్నాడు. మరి ఎవరా దర్శకుడు..? బాద్ షాను మెప్పించిన ఆ టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరు..? ఎన్నేళ్లయ్యింది.. షారూఖ్ ఖాన్ ఖాతాలో హిట్ పడక. కెరీర్ మళ్లీ గాడిన పడుతుందని.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్, జీరో సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపించాలంటే.. ప్రస్తుతం ఆయనకో హిట్ కావాలి. అందుకే పఠాన్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు షారుక్. యాక్షన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వస్తున్న పఠాన్.. వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. పఠాన్ తర్వాత షారూఖ్ కు వరుసగా సంజయ్ లీలా బన్సాలీ, రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో మూవీస్ చేసే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందుగానే ఓ కోలీవుడ్ డైరెక్టర్ తో కమిట్ అయినట్లు తెలుస్తుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీతో షారూఖ్ మూవీ చేస్తారనే రూమర్ చాలాకాలంగా ఉంది. ఇప్పుడదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
త్వరలోనే వీరిద్దరి ప్రాజెక్టు పట్టాలెక్కనుందని చెబుతున్నారు. రాజారాణి, పోలీసోడు, అదిరింది, విజిల్ వంటి మూవీస్ తో.. అట్లీ తన సత్తా చాటాడు. ఏకంగా ఆల్ ఓవర్ ఇండియాకు తన మార్క్ డైరెక్షన్ ను చూపించాడు. విజిల్ తర్వాత రెండేళ్లుగా అట్లీ ఇంతవరకు ఎవరితోనూ ప్రాజెక్టు ఒప్పుకోలేదు. కేవలం షారూఖ్ ఖాన్ కోసమే.. వెయిట్ చేస్తున్నాడు. ఇటు చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత.. సౌత్ పై మనస్సు పారేసుకున్న బాద్ షా.. అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అట్లీ మూవీలో షారూఖ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడని కూడా టాక్ నడుస్తుంది. ఒక పాత్రలో పోలీస్ అధికారిగా.. మరో పాత్రలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం అట్లీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడని.. అన్నీ కుదిరితే.. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్.. సెట్స్ పైకి రానుందని చెబుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :