AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amitabh Bachchan: కాలం మన కోసం ఆగదని అర్థమైంది.. ఎమోషనల్‌ నోట్‌ పోస్ట్ చేసిన బిగ్‌ బీ..

అమితాబ్‌ బచ్చన్‌.. ఈ పేరును ప్రస్తావించకుండా భారతీయ సినీ పరిశ్రమ ప్రస్థానం పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియన్‌ సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు బిగ్‌బి అమితాబ్‌. అత్యంత చిన్న స్థాయి నుంచి యావత్‌ దేశం గర్వించే నటుడుగా ఎదిగిన బిగ్‌బి జీవితం..

Amitabh Bachchan: కాలం మన కోసం ఆగదని అర్థమైంది.. ఎమోషనల్‌ నోట్‌ పోస్ట్ చేసిన బిగ్‌ బీ..
Amitabh Bachchan
Narender Vaitla
|

Updated on: Nov 02, 2022 | 10:32 AM

Share

అమితాబ్‌ బచ్చన్‌.. ఈ పేరును ప్రస్తావించకుండా భారతీయ సినీ పరిశ్రమ ప్రస్థానం పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియన్‌ సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు బిగ్‌బి అమితాబ్‌. అత్యంత చిన్న స్థాయి నుంచి యావత్‌ దేశం గర్వించే నటుడుగా ఎదిగిన బిగ్‌బి జీవితం ఎంతో మందికి ఆదర్శం. 80 ఏళ్ల వయసులోనూ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉంటే మారుతోన్న కాలానికి అనుగుణంగా పరిస్థితులు కూడా మారుతాయని చెబుతున్నారు అమితాబ్. తన జీవితంలో చూస్తున్న మార్పులకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

తన పర్సనల్‌ బ్లాగ్‌లో ఫిలసాఫికల్‌ నోట్‌ను పోస్ట్‌ చేశారు అమితాబ్‌. గతంలో తనను పలకరించడానికి ముంబయిలోని సొంతిళ్లు జల్సా వద్దకు ప్రతి ఆదివారంలో వందల సంఖ్యలో అభిమానులు వచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోయిందని రాసుకొచ్చారు. ఒకప్పుడు అభిమానుల కేరింతలు కొట్టేవారని, ఎంతో ఉత్సాహంతో ఉండేవారని కానీ ప్రస్తుతం మొబైల్‌లో ఫోన్లలో ఫొటోలు తీసుకునే దృశ్యాలే కనిపిస్తాయన్నారు.

ఎన్నో ఏళ్ల నుంచి సండేమీట్స్‌ పేరుతో అభిమానులను కలుస్తున్నానని రాసుకొచ్చిన అమితాబ్‌.. ఈ మధ్య దీనికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయిందని వాపోయారు. మునపటి ఉత్సాహం ఎవ్వరిలోనూ కనపించడం లేదని, వీటన్నింటినీ గమనిస్తుంఏ ఏదీ శాశ్వతం కాదని బోధపడుతోంది. సమయం మనకోసం ఆగదనే విషయం అర్థమైందని తనదైన శైలిలో సుదీర్ఘ పోస్ట్‌ రాసుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..