AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kushboo: వారి చూపులోనే తప్పుంది.. పొన్నియన్ సెల్వన్ సినిమా కాంట్రావర్సీపై కుష్బూ సంచలన వ్యాఖ్యలు..

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన హిస్టారికల్ మూవీ పొన్నియన్ సెల్వన్.. తమిళనాట కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. కోలీవుడ్‌తో పాటు, రాజకీయ పరంగా కూడా రచ్చ క్రియేట్ చేస్తోంది పొన్నియన్ సెల్వన్.

Kushboo: వారి చూపులోనే తప్పుంది.. పొన్నియన్ సెల్వన్ సినిమా కాంట్రావర్సీపై కుష్బూ సంచలన వ్యాఖ్యలు..
Kushboo Sundar
Shaik Madar Saheb
|

Updated on: Oct 05, 2022 | 3:45 PM

Share

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన హిస్టారికల్ మూవీ పొన్నియన్ సెల్వన్.. తమిళనాట కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. కోలీవుడ్‌తో పాటు, రాజకీయ పరంగా కూడా రచ్చ క్రియేట్ చేస్తోంది పొన్నియన్ సెల్వన్. లేటెస్ట్‌గా కుష్బూ చేసిన కామెంట్స్ సినిమాకు పొలిటికల్ కలర్స్‌ని అద్దేశాయి. సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తూ.. చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు కుష్బూ. చరిత్రను రెండున్నర గంటల్లో చెప్పడమంటే మాటలు కాదని, అది మణిరత్నం వల్లే అవుతుందని చెప్పారు. రాజరాజ చోళన్‌ని హిందువుగా చూపారంటూ డైరెక్టర్ వెట్రిమారన్ చేసిన కామెంట్‌కి కౌంటరిచ్చారు కుష్బూ.. చూసే కళ్లలోనే తేడా ఉందని, వీళ్లందరూ మైండ్ సెట్ మార్చుకోవాలంటూ సూచించారు. కాగా.. తాజాగా కుష్బూ చేసిన వ్యాఖ్యలు.. టాక్ ఆఫ్‌ది కోలీవుడ్‌ గా మారాయి.

ఐదు రోజుల్లోనే రూ.200 కోట్లు..

ఐదు రోజుల్లోనే 200 కోట్లు కలెక్ట్ చేసి, సూపర్ సక్సెస్ అయిన పొన్నియన్ సెల్వన్ మూవీకి వీళ్లిచ్చే రివ్యూలు అవసరం లేదన్నారు కుష్బూ. చరిత్రను మార్చడం ఎవ్వరి తరమూ కాదని, పైగా మణిరత్నం లాంటి దర్శకులు అటువంటి తప్పు చెయ్యనే చెయ్యరని సాలిడ్ స్టేట్‌మెంట్ చెప్పారామె. చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్‌కి కాషాయ రంగు దుస్తులతో వచ్చిన కుష్బూ… మణిరత్నంని పొగిడేస్తూ… కొందరు యువ దర్శకులపై కామెంట్లు చేయడం కొత్త వివాదానికి దారితీసింది.

అటు… సినీ పరిశ్రమకు కాషాయ రంగు పులిమేస్తున్నారంటున్న దర్శకుడు వెట్రిమారన్‌క్కూడా మద్దతు పెరుగుతోంది. రాజరాజ చోళుడుకి, తిరువళ్ళువర్‌కి కాషాయ రంగు జెండా కప్పడమేంటని నిలదీస్తున్నారు. ఈ కామెంట్లకి.. పేరరసు లాంటి దర్శకులు గట్టిగానే రిప్లయ్ కౌంటర్లిస్తున్నారు.

హిందూ మతాన్ని, దేవుళ్లని వ్యతిరేకించడం కొంతమందికి ఫ్యాషన్‌గా మారిందన్న వెర్షన్‌కి కుష్బూ కామెంట్లు బలానిచ్చాయి. ఈ కామెంట్లు, కౌంటర్లు పొన్నియన్ సెల్వన్ మూవీకి కమర్షియల్‌గా ప్లస్ అవుతున్నాయి. తమిళనాట పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది మణిరత్నం తాజా మూవీ.

మరిన్ని సినిమా వార్తల కోసం..