The Ghost Review: ది ఘోస్ట్: యావరేజ్ యాక్షన్ డ్రామా..

సంక్రాంతికి బంగార్రాజుతో హిట్ కొట్టిన నాగార్జున.. దసరాకు వచ్చి ఘోస్ట్‌తో బాక్సాఫీస్ దగ్గర మాయ చేయాలనుకుంటున్నారు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్..

The Ghost Review: ది ఘోస్ట్: యావరేజ్ యాక్షన్ డ్రామా..
The Ghost
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Ravi Kiran

Updated on: Oct 05, 2022 | 3:43 PM

  • సినిమా: ది ఘోస్ట్
  • నటీనటులు : నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు
  • సంగీతం: మార్క్ కె.రాబిన్స్, భరత్-సౌరభ్
  • సినిమాటోగ్రఫీ : ముఖేష్ జి.
  • నిర్మాతలు : సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహనరావు, శరత్ మరార్
  • రచన, దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
  • విడుదల తేదీ: అక్టోబర్ 5, 2022

సంక్రాంతికి బంగార్రాజుతో హిట్ కొట్టిన నాగార్జున.. దసరాకు వచ్చి ఘోస్ట్‌తో బాక్సాఫీస్ దగ్గర మాయ చేయాలనుకుంటున్నారు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 5న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? గాడ్ ఫాదర్‌ను తట్టుకుని నాగ్ సినిమా హిట్ కొడుతుందా..?

కథ:

విక్రమ్ (నాగార్జున) ఒక ఇంటర్‌పోల్ ఆఫీసర్. అండర్ వరల్డ్ అంటేనే మండి పడుతుంటాడు. అలాగే ఆయనకు కోపం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఓ ఆపరేషన్‌లో భాగంగా చిన్న పిల్లాడు చనిపోవడంతో.. మాఫియాను అంతం చేయడానికి బయల్దేరతాడు. తన తోటి ఇంటర్‌పోల్ ఆఫీసర్ ప్రియ(సోనాల్ చౌహాన్)తో రిలేషన్ షిప్‌లో ఉంటాడు విక్రమ్. పిల్లాడి మరణం తర్వాత ఇంటర్‌పోల్ జాబ్‌కు రిజైన్ చేసి దూరంగా ఉంటాడు. అలాంటి సమయంలో దాదాపు 5 సంవత్సరాల తర్వాత తన అక్క అను (గుల్ పనాగ్) నుంచి కాల్ వస్తుంది. తనకు, తన కూతురు అదితి (అనిఖా సురేంద్రన్)కి ప్రాణ హాని ఉందని చెప్పడంతో విక్రమ్ అక్కడే ఉండిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? వాళ్లను చంపాలనుకుంటున్నది ఎవరు..? వాళ్లను విక్రమ్ ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథ..

కథనం:

ది ఘోస్ట్ అని టైటిల్ చూసినపుడే ఇది పూర్తిగా యాక్షన్ సినిమా అని అర్థమైపోతుంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా దీనికే స్టిక్ అయి ఉన్నాడు. ఎక్కడా డీవియేట్ కాకుండా తాను చెప్పాలనుకున్న కథను యాక్షన్ కోణంలోనే చెప్పాడు. మొదటి సన్నివేశం నుంచే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గానే మొదలు పెట్టాడు. గరుడవేగలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు తీసిన ప్రవీణ్ సత్తారు ఇందులోనూ అదరగొట్టాడు. ముఖ్యంగా సినిమా ఎలా ఉందనే విషయం పక్కనబెడితే యాక్షన్ సీన్స్ మేకింగ్ విషయంలో ప్రవీణ్ రేంజ్ అర్థమవుతుంది. కానీ కథ విషయంలోనూ ఇదే పట్టు ఉండుంటే ఘోస్ట్ రేంజ్ మారిపోయేది. చాలా సింపుల్ కథను అంతకంటే సింపుల్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు ప్రవీణ్ సత్తారు. అదే ఘోస్ట్‌కు మైనస్ అయింది. ఫస్టాఫ్ వరకు సినిమా అంతా సాదా సీదాగానే సాగుతుంది. అనుతో పాటు ఆమె కూతురును చంపాలనుకోవడం.. వాళ్లను విక్రమ్ కాపాడాలని చూడటం.. ఇంటర్వెల్ ట్విస్టుతో ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. అక్కడ కూడా ఎక్కువగా ఎమోషన్స్ కంటే యాక్షన్ సన్నివేశాలపైనే ఆధారపడ్డాడు దర్శకుడు. దానికితోడు సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నట్లు అనిపిస్తుంది. హీరోను చంపే అవకాశం విలన్స్‌కు ఎన్నోసార్లు వస్తుంది కానీ వాళ్లు మాత్రం హీరో వచ్చి చంపేంత వరకు వెయిట్ చేస్తుంటారు. ఎంత కాదన్నా అది లాజిక్‌కు అందదు. అలాంటి సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. దానికితోడు గరుడవేగలో ఫ్యామిలీ సీన్లు బాగానే హ్యాండిల్ చేసిన ప్రవీణ్.. ఘోస్ట్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇబ్బంది పడినట్లు అర్థమవుతుంది. ఓవరాల్‌గా యాక్షన్ లవర్స్‌ను ఘోస్ట్ ఎంగేజ్ చేసే ఛాన్స్ ఉంది.

నటీనటులు:

నాగార్జునకు ఈ తరహా పాత్రలు కొత్తేం కాదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చేసారు. ఇప్పుడు మరోసారి ఘోస్ట్‌గా అదరగొట్టాడు. పైగా ఆయన స్క్రీన్ ప్రజెన్స్ మ్యాజికల్‌గా ఉంటుంది. సోనాల్ చౌహాన్ అందాల ఆరబోతతో పాటు యాక్షన్ సీన్స్ కూడా బాగా చేసింది. మరో రెండు కీలక పాత్రల్లో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఆకట్టుకున్నారు. మిగతా వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

టెక్నికల్‌గా ఘోస్ట్ హై స్టాండర్డ్స్‌లో ఉంది. మార్క్ కే.రాబిన్స్, భరత్-సౌరభ్ అందించిన మ్యూజిక్, ఆర్ఆర్ బాగున్నాయి. వేగం పాట చాలా బాగుంది. విజువల్‌గానూ ఈ పాట అదిరిపోయింది. దినేష్ సుబ్బరాయన్, కిచ్చా యాక్షన్ సీన్లు సినిమాకు ప్రాణం. సినిమాటోగ్రాఫర్ ముఖేష్.జి విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాత్రం కథకుడిగా కంటే.. యాక్షన్ మేకింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. స్క్రీన్ ప్లే పరంగా మరింత జాగ్రత్తగా ఉండుంటే ఘోస్ట్ మంచి యాక్షన్ సినిమా అయ్యుండేది.

పంచ్ లైన్: ఓవరాల్‌గా ది ఘోస్ట్.. యావరేజ్ యాక్షన్ డ్రామా..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
కంగువా ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో కొత్త వివాదం..టాలీవుడ్‌లో ప్రకంపనలు
కంగువా ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో కొత్త వివాదం..టాలీవుడ్‌లో ప్రకంపనలు
ఈ ఆలయంలో దేవుళ్ళకు కాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ కి పూజలు.. ఎందుకంటే..
ఈ ఆలయంలో దేవుళ్ళకు కాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ కి పూజలు.. ఎందుకంటే..
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ..
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ..
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
బంగాళ దుంప రసంతో అందాన్ని పెంచుకోండిలా..!
బంగాళ దుంప రసంతో అందాన్ని పెంచుకోండిలా..!
జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.601తో ఏడాది పాటు 5జీ నెట్‌!
జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.601తో ఏడాది పాటు 5జీ నెట్‌!
జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్
జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు మధుమేహం వస్తుందని హెచ్చరిక
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు మధుమేహం వస్తుందని హెచ్చరిక
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!