AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‏బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ ఆసక్తికర కామెంట్స్.. ఆ కంటెస్టెంట్ నాకు చెల్లి అంటూ..

బిగ్‏బాస్ సీజన్ 4 విన్నర్‏గా నిలిచిన అభిజిత్ వరుస ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నాడు. అటు అరియానా, సోహైల్, హారిక, అఖిల్, అభిజిత్ టాప్ 5లో నిలిచారు.

బిగ్‏బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ ఆసక్తికర కామెంట్స్.. ఆ కంటెస్టెంట్ నాకు చెల్లి అంటూ..
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 22, 2020 | 4:35 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 4 విన్నర్‏గా నిలిచిన అభిజిత్ వరుస ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నాడు. అటు అరియానా, సోహైల్, హారిక, అఖిల్, అభిజిత్ టాప్ 5లో నిలిచారు. కాగా సోహైల్, అఖిల్ నుంచి గట్టి పోటి వచ్చినా అభిజిత్ ఎదుర్కోని బిగ్‏బాస్ సీజన్ 4 విన్నర్ అయ్యాడు. అయితే ఓ టీవీ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిజిత్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

బిగ్‏బాస్ హౌస్‏లో మొదటి నుంచి మోనాల్‏తో క్లోజ్‏గా ఉన్నాడు అభిజిత్. ఆ తర్వాత వాళ్ళీద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలతో అభి హారికకు దగ్గరయ్యాడు. కాగా వీరిద్దరు షో చివరి వరకు క్లోజ్‏గానే ఉన్నారు. తాజాగా ఓ టీవీ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హారిక నా చెల్లి అంటూ ఆసక్తిక కామెంట్స్ చేశాడు అభి. ఈ విషయాన్ని తాను చాలా సార్లు హౌస్‏లో హారికకు చెప్పానని అన్నాడు. అభిజిత్ మాట్లాడుతూ.. “నాకు తమ్ముడు ఉన్నాడు. హారిక లాంటి చెల్లెలు ఉంటే బాగుండు అని అనుకునేవాడిని. ఈ విషయాన్ని హారికకు కూడా చాలా సార్లు చెప్పాను. కానీ అది బయటకు రాలేదని ఇప్పుడే తెలిసింది” అని సమాధానమిచ్చాడు అభిజిత్.