AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: సిరి, కాజల్‌ల రెండు రోజుల కష్టం వృధా.. అనర్హలుగా ప్రకటించిన బిగ్‌బాస్‌. పండగ చేసుకున్న సన్నీ..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ కెప్టెన్సీలో భాగంగా ఇచ్చిన బీబీ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్‌ సృష్టించిన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. హౌజ్‌ మేట్స్‌ను రెండు గ్రూప్‌లుగా విభజించిన బిగ్‌బాస్‌..

Bigg Boss 5 Telugu: సిరి, కాజల్‌ల రెండు రోజుల కష్టం వృధా.. అనర్హలుగా ప్రకటించిన బిగ్‌బాస్‌. పండగ చేసుకున్న సన్నీ..
Narender Vaitla
|

Updated on: Oct 14, 2021 | 12:44 PM

Share

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ కెప్టెన్సీలో భాగంగా ఇచ్చిన బీబీ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్‌ సృష్టించిన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. హౌజ్‌ మేట్స్‌ను రెండు గ్రూప్‌లుగా విభజించిన బిగ్‌బాస్‌.. సిరి, కాజల్ ఫ్యాక్టరీ మేనేజర్‌ సంచాలకులుగా వ్యవహరిస్తారని చెప్పాడు. టాస్క్‌లో భాగంగా ఏ టీమ్‌ ఎక్కువగా బొమ్మలు తయారు చేస్తే వారు విజయం సాధించినట్లు. ఈ టాస్క్‌ ఆధారంగానే కాజల్‌, సిరిలలో ఒకరిని కెప్టెన్‌గా ఎన్నుకోవాల్సి ఉంది. గత రెండు రోజులుగా కొనసాగుతోన్న ఈ టాస్క్‌ మూడో రోజు (గురువారం) కూడా కొనసాగింది.

తాజాగా గురువారం ఎసిపోడ్‌కు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో భాగంగా పూర్తి చేసిన బొమ్మల కౌంట్‌ని బిగ్‌బాస్‌కి చెప్పండి సిరి, కాజల్‌కు బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఈ కౌంటింగ్‌ సమయంలో కాజల్‌, శ్వేతకు మధ్య చిన్న వాగ్వివాదం జరిగింది. ఇక సిరి మాట్లాడుతూ.. ‘మొత్తం దొంగతనాలు జరిగాయి, లాక్కున్నారు, పీక్కున్నారు ఇప్పుడేమో వచ్చి రీ చెకింగ్ చేయాలనుంటున్నారని’ వాపోయింది. ఈ క్రమంలోనే లోబో, కాజల్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు జట్లకు చెందిన సభ్యులు తయారు చేసిన కొన్ని బొమ్మలను కౌంట్‌లో నుంచి తీసేసి పక్కన పడేశారు సిరి, కాజల్‌. ఇక టాస్క్‌ ముగిసిందనుకుంటున్న సమయంలో బిగ్‌బాస్‌ ఒక్కసారిగా బాంబు పెల్చేశాడు.

ఈ టాస్క్ జరుగుతున్న సమయంలో కొంత మంది బిగ్‌బాస్‌ సభ్యులు.. ఇంటి అతి ముఖ్యమైన నిబంధనను ఉల్లంఘించారంటూ చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగకుండా.. కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు సిరి, కాజల్‌ అర్హతకు కోల్పోయారని బిగ్‌బాస్‌ ప్రటకించాడు. దీంతో రెండు రోజులు సిరి, కాజల్‌ పడ్డ కష్టం అంతా వృథా అయ్యిందని చెప్పాలి. ఇక వీరిద్దరిని అనర్హులుగా ప్రకటించడంతో సన్నీ పండగ చేసుకున్నాడు. డ్యాన్స్‌లు చేస్తూ సిరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మరి ఈ వ్యవహరం ఇంకెంత దూరం వెళుతుందో తెలియాలంటే ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్‌ చూడాల్సిందే..

Also Read: Viral Video: పోలా.. అదిరిపోలా.. చేపలు పట్టేందుకు కొంగ కొత్త ప్లాన్..

Trailer Talk: మారుతి మార్క్‌ కామెడీతో ‘మంచి రోజులు వచ్చాయి’.. ట్రైలర్‌ ఎలా ఉందో చూశారా.?

చంద్రుడిపై నడిచే బైక్‌.. చూస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో