AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hema Comments: రాత్రి గెలిచాం.. ఉదయం ఓడిపోయాం.. ఏం జరిగిందో అమ్మవారికే తెలియాలన్న హేమ..

మా..లో లెటెస్ట్‌గా బ్లాస్ట్ అయిన డైలాగ్ ఇది. మా ఎన్నికల్లో ఏదో జరిగిందన్నది హేమ ఆరోపణ. ఆ.. ఏదో ఏంటన్నది మాత్రం చెప్పలేదామె. రాత్రికి గెలిచాం.. పొద్దునకి ఓడిపోయాం. అదేలాగో తెలియదు.. అమ్మవారికైనా..

Hema Comments: రాత్రి గెలిచాం.. ఉదయం ఓడిపోయాం.. ఏం జరిగిందో అమ్మవారికే తెలియాలన్న హేమ..
Hema On Maa
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 14, 2021 | 1:06 PM

మా..లో లెటెస్ట్‌గా బ్లాస్ట్ అయిన డైలాగ్ ఇది. మా ఎన్నికల్లో ఏదో జరిగిందన్నది హేమ ఆరోపణ. ఆ.. ఏదో ఏంటన్నది మాత్రం చెప్పలేదామె. రాత్రికి గెలిచాం.. పొద్దునకి ఓడిపోయాం. అదేలాగో తెలియదు.. అమ్మవారికైనా తెలుసో లేదో అంటూ మా ఎన్నికల ఫలితాలపై పెద్ద డౌట్ క్రియేట్ వదిలేశారు హేమ. విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకున్నారు నటి హేమ. అనంతరం కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. మా ఎన్నికలపై అనుమానాలు మొదటినుంచి ఉన్నా.. అమ్మవారిగా సాక్షిగా బయటపెట్టారు హేమ. ఒక్క హేమనే కాదు గతంలో అనసూయ కూడా ఇలాగే ట్వీట్ చేసింది.  ట్వీట్‌తో అనుమానాలు రెయిజ్ చేసిన అనసూయ ఆ తర్వాత కూడా తన మనసులో మాట బయటపెట్టారు.

మా ఎన్నికలు తెలుగురాష్ట్రాల్లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి. అంతకుమించి అనేలా వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఫైనల్‌గా ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు తేలిపోయాయి. అయినా రోజుకో డౌటానుమానాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. నిజంగా హేమ, అనసూయ ఆరోపించినట్టు కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయా..? రాత్రి గెలిచిన అభ్యర్థులు మరుసటి రోజు ఎందుకు ఓడిపోయారన్నది మిస్టరీగా మారింది.

అందరి సమక్షంలోనే కౌంటింగ్‌ జరిగింది. ఫలితాలు వెలువడ్డాక గెలిచిన సభ్యులు సంబరాలు చేసుకున్నారు. అంతాబాగానే ఉంది. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగింది? అధికారికంగా ఫలితాలు ప్రకటించకుండా మరుసటి రోజుకి ఎందుకు పోస్ట్‌పోన్ చేశారు? బ్యాలెట్‌ బాక్సులు ఇంటికి తీసుకెళ్లారా? అక్కడే సీన్ తారుమారైందా? అన్న అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలు, సందేహాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేదెవరన్న చర్చ ఫిలింనగర్‌ను హీటెక్కిస్తోంది.

ఇవి కూడా చదవండి: Teacher Beating: అమ్మో.. సారు కొట్టుడు మాములుగా లేదుగా.. విద్యార్థులను మరో రేంజ్‌లో చితకబాదిన టీచర్..

Potato Cheela Recipe: ఆలుతో అద్భుమైన బ్రేక్‌ఫాస్ట్.. పిజ్జాను మించిపోయే రుచి.. ఇంకెందుకాలస్యం

SBI: దాచుకోవడమే కాదు.. సంపాదించడం కూడా తెలుసుకోండి.. ఎస్‌బీఐ అందించే అద్భతమైన డిపాజిట్ స్కీమ్..

Chanakya Niti: జీవితంలో ఈ మూడింటిని వదిలేస్తే.. ధన లక్ష్మి మీ ఇంటి తలుపులు తడుతుంది..