ఆ దర్శకనిర్మాత తొమ్మిదేళ్లుగా నా ఫోన్‌ని లిఫ్ట్ చేయడం లేదు

ఆ దర్శకనిర్మాత తొమ్మిదేళ్లుగా నా ఫోన్‌ని లిఫ్ట్ చేయడం లేదు

సుశాంత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్‌లోని లొసుగులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బాలీవుడ్‌లోని ప్రముఖులు సుశాంత్‌కి ఆఫర్లు రాకుండా చేశారని పలువురు ఆరోపించారు

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 08, 2020 | 10:06 PM

Adhyayan Suman on Nepotism: సుశాంత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్‌లోని లొసుగులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బాలీవుడ్‌లోని ప్రముఖులు సుశాంత్‌కి ఆఫర్లు రాకుండా చేశారని పలువురు ఆరోపించారు. అంతేకాదు బాలీవుడ్‌లో నెపోటిజం నడుస్తోందని గళమెత్తారు. ఈ నేపథ్యంలో శేఖర్ సుమన్ తనయుడు, నటుడు అధ్యాయన్ సుమన్ బాలీవుడ్‌లోని ఓ దర్శకనిర్మాతపై సంచలన ఆరోపణలు చేశారు.

అతడి పేరును బయటపెట్టకుండా.. ”ప్రస్తుతం కాంట్రవర్సీలో ఉన్న ఓ బడా దర్శకనిర్మాతను నేను తొమ్మిదేళ్ల క్రితం లాస్ ఏంజిల్స్‌లో కలిశాను. ఆయనతో వర్క్‌ చేయాలనుకున్నానని చెప్పాను. తనకు ఎప్పుడైనా సరే కాల్ చేయమని నంబర్ ఇచ్చారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు అతడు నా ఫోన్‌ని లిఫ్ట్ చేయడం లేదు. నా మెసేజ్‌లను చదివినా రిప్లై ఇవ్వడు. దాంతో తెలీకుండా కోపం వచ్చి, నెగిటివ్‌లోకి వెళ్లిపోయా. నేను సరిపోనేమో, లేక అతనికి నేను సరిపోనా..? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఆ తరువాత నేను కరెక్ట్‌ అని తెలుసుకున్నా. నేను విజయవంతం అవ్వలేదు. అందుకే నా ఫోన్‌ని ఆయన లిఫ్ట్ చేయలేదేమో అనుకున్నా” అని అధ్యాయన్ చెప్పుకొచ్చారు. అయితే బయటి వారే కాదు, ఇండస్ట్రీలోని వారు సైతం బాలీవుడ్‌లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారని ఈ నటుడు తెలిపారు. కాగా పలు సినిమాల్లో నటించిన అధ్యాయన్‌కి అనుకున్నంత పేరు రాలేదు. దీంతో ఈ నటుడు మ్యూజిక్ వైపు వెళ్లిపోయారు.

Read This Story Also: ఇంటి ముందు పుర్రెలు.. తమిళనాడులో కలకలం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu