పెళ్లికి సంద‌ర్భంగా రానాకు అక్షయ్ విషెస్

టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్​ల వివాహంపై స్పందించాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.

  • Ram Naramaneni
  • Publish Date - 10:42 pm, Sat, 8 August 20
పెళ్లికి సంద‌ర్భంగా రానాకు అక్షయ్ విషెస్

టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్​ల వివాహంపై స్పందించాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ప‌ర్మనెంట్‌గా లాక్​డౌన్ అవడానికి ఇదే సిసలైన మార్గం అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు. “రానా దగ్గుబాటి… కంగ్రాట్స్. మీ జంట జీవితకాలం ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా” అని అక్షయ్​ పేర్కొన్నాడు.

ఇప్పటికే రానా-మిహీక పెళ్లి వేడుకకు రామానాయుడు స్టూడియో అందంగా ముస్తాబు అయింది. ఆగస్టు 8న(ఈరోజు) రాత్రి 8.30 గంటలకి రానా దగ్గుబాటి తన ఫ్రెండ్ మిహీకా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు.