Bangarraju: బంగార్రాజు నుంచి నాగ చైతన్య ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది.. అసలు విషయం తేలేది రేపే..

Bangarraju: నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'బంగార్రాజు'. 'సొగ్గాడు మళ్లీ వచ్చాడు' అన్న క్యాప్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. గతంలో 2016లో వచ్చిన సొగ్గాడే చిన్ని నాయనా..

Bangarraju: బంగార్రాజు నుంచి నాగ చైతన్య ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది.. అసలు విషయం తేలేది రేపే..
Naga Chaitanya
Follow us

|

Updated on: Nov 22, 2021 | 5:55 PM

Bangarraju: నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ‘సొగ్గాడు మళ్లీ వచ్చాడు’ అన్న క్యాప్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. గతంలో 2016లో వచ్చిన సొగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ఈ సినిమాను ప్రీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ఈ సినిమాలో నాగార్జున ఎలా చనిపోయాడన్న విషయాన్ని చూపించనున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై సహంజగానే ఆసక్తి నెలకొంది. దీంతో పాటు ఇందులో నాగార్జున తనయుడు నాగ చైతన్య కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా పరిస్థితులు మెరుగుపడడంతో చిత్ర యూనిట్‌ శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసే పనిలో పడింది.

ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్‌ నాగ చైతన్య పుట్టిన రోజును పురస్కరించుకొని అప్‌డేట్‌ ఇచ్చింది. నవంబర్‌ 23 (మంగళవారం) నాగ చైతన్య పుట్టిన రోజు ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో నాగచైతన్య ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇక పుట్టిన రోజు నేపథ్యంలో రేపు టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇక చిత్ర యూనిట్‌.. ‘బంగార్రాజు ఫస్ట్‌లుక్‌’ అని ప్రస్తావిస్తూ.. చైతన్య లుక్‌ను రిలీజ్‌ చేయడంతో.. నాగార్జున పాత్రను చైతన్య పోషిస్తున్నాడన్న అన్న అనుమానాలు వస్తున్నాయి. అలాగే చైతన్య జోడిగా కృతీ శెట్టి నటిస్తుండడంతో.. రమ్యకృష్ణ పాత్రే కృతీనా అన్న అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. మరి ఈ అనుమానాలపై క్లారిటీ రావాలంటే రేపు విడుదలయ్యే టీజర్‌ చూడాల్సిందే. మంగళవారం ఉదయం 10:23 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నారు.

Also Read: Jersey: ఈ చిత్రం నాకెంతో స్పెషల్‌.. హిందీ జెర్సీ రిలీజ్‌ డేట్‌ వెల్లడించిన షాహిద్‌ కపూర్‌

SMAT 2021: చివరిబంతికి సిక్స్‌ కొట్టి గెలిపించిన షారుక్‌ ఖాన్‌.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత తమిళనాడు

SMAT 2021: చివరిబంతికి సిక్స్‌ కొట్టి గెలిపించిన షారుక్‌ ఖాన్‌.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత తమిళనాడు