Balagam: చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం.. కళ్లు చెదిరేలా బలగం కలెక్షన్లు.
చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకుంది బలగం మూవీ. కమెడియన్ వేణు తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. తెలంగాణ నెటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను...

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకుంది బలగం మూవీ. కమెడియన్ వేణు తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. తెలంగాణ నెటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. రోజురోజుకీ టాక్ పెరగడంతో మల్టీ ప్లెక్సుల్లోనూ సినిమాకు క్రమంగా షోస్ పెరుగుతున్నాయి. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే బలగం మూవీ కలెక్షన్లు సైతం భారీగా పెరుగుతున్నాయి. మార్చి 3వ తేదీన విడుదలైన ఈ సినిమా శనివారం నాటికి సుమారు రూ. 7.85 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక ఆదివారం కావడంతో సినిమాకు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు కలెక్షన్స్ కూడా యాడ్ అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల బెంచ్ మార్క్‌ను దాటే అవకాశం కనిపిస్తుంది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇక ఏపీలోనూ బలగం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 5.52 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 3.63 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 9.15 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 4.02 కోట్లు షేర్‌ను ఈ మూవీ వసూలు చేసి సత్తా చాటుకుంది. ఇప్పట్లే మరే పెద్ద సినిమా లేకపోవడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..







