Avika Gor : మెగా హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న చిన్నారి పెళ్లికూతురు.. ఆ హీరో ఎవరంటే..
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన నటి అవికా గోర్. తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజు గారి గది 3’ సినిమాలతో..
Avika Gor : ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన నటి అవికా గోర్. తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజు గారి గది 3’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ ఇటీవల సైజ్ జీరోగా మారి అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేసింది. ఈ మధ్య అవికా గోర్ తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. ప్రేమలో ఉన్నాం.. త్వరలోనే ఒక్కటి కాబోతోన్నామని ప్రకటించింది. అంతే కాకుండా ప్రేమికుడు గురించి ఎంతో గొప్పగా చెప్పింది. ప్రేమలో ఉన్న అనుభూతి గురించి వివరించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు మెగా కాంపౌండ్ లో కి అడుగు పెడుతుందని వార్తలు వస్తున్నాయి. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన ఈ భామ క్రేజీగా అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని అవిక స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాను శ్రీధర్ సీపాన దర్శకత్వంవహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ఏఏఏ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తిరిగి టాలీవుడ్ లో బిజీ అవుతుందేమో చూడాలి.
Pradeep Movie: తన మూవీ ప్రతి ఒక్కరికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది.. ప్రామిస్ చేస్తున్న ప్రముఖ యాంకర్