AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండేళ్ళ తర్వాత.. టాలీవుడ్ కు రీ-ఎంట్రీ

‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ తో బాగా ఫేమస్ అయింది హీరోయిన్ అవికా గోర్. ‘ఉయ్యాలా జంపాలా’ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అవికా.. సినిమాల నుంచి రెండేళ్లు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదీకూడా తన మొదటి సినిమా హీరో రాజ్ తరుణ్ సినిమా ద్వారా అని సమాచారం. రీసెంట్ గా రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ‘ఇద్దరి లోకం […]

రెండేళ్ళ తర్వాత.. టాలీవుడ్ కు రీ-ఎంట్రీ
Ravi Kiran
|

Updated on: Apr 28, 2019 | 8:20 AM

Share

‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ తో బాగా ఫేమస్ అయింది హీరోయిన్ అవికా గోర్. ‘ఉయ్యాలా జంపాలా’ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అవికా.. సినిమాల నుంచి రెండేళ్లు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదీకూడా తన మొదటి సినిమా హీరో రాజ్ తరుణ్ సినిమా ద్వారా అని సమాచారం. రీసెంట్ గా రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే సినిమా లాంచ్ అయింది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా అవికా గోర్‌ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది.

మరోవైపు తెలుగులో అవికా నటించిన లాస్ట్ ఫిలిమ్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. ఆ సినిమా తర్వాత దాదాపు రెండేళ్ళు నటనకు దూరంగా ఉన్న అవికా ఇప్పుడు మళ్ళీ వెండితెరపై కనిపించేందుకు రెడీ అయింది. ఈ సినిమాతో పాటు డైరెక్టర్ మారుతి- మెగా హీరో సాయి తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో కూడా హీరోయిన్ గా అవికా పేరును పరిశీలిస్తున్నారని టాక్.  ఈ రెండు ప్రాజెక్టులు ఫైనలైజ్ అయితే అవికా మళ్ళీ టాలీవుడ్ లో జోరందుకోవడం ఖాయం.

Follow Us