మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నాం

కోలీవుడ్‌లో పెళ్లిళ్ల పర్వం నడుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన అనీషాతో విశాల్ వివాహాన్ని ఫిక్స్ చేసుకోగా.. అంతకంటే ముందే పెళ్లి పీటలెక్కబోతున్నాడు సహ నటుడు ఆర్య. దిలీప్ కుమార్- సైరా భాను మనవరాలు, నటి సాషేషాను ఆర్య పెళ్లాడనున్నాడు. ఈ ఏడాది మార్చిలో వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించాడు. Happy Valentines Day ? #Blessed ? @sayyeshaa pic.twitter.com/WjRgOGssZr — Arya (@arya_offl) February 14, 2019 ‘‘మా […]

మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నాం

కోలీవుడ్‌లో పెళ్లిళ్ల పర్వం నడుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన అనీషాతో విశాల్ వివాహాన్ని ఫిక్స్ చేసుకోగా.. అంతకంటే ముందే పెళ్లి పీటలెక్కబోతున్నాడు సహ నటుడు ఆర్య. దిలీప్ కుమార్- సైరా భాను మనవరాలు, నటి సాషేషాను ఆర్య పెళ్లాడనున్నాడు. ఈ ఏడాది మార్చిలో వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించాడు.

‘‘మా కుటుంబ సభ్యుల దీవెనలతో మేమిద్దరం ఒకటి అవ్వబోతున్నాం. ఈ మార్చిలో మా ఇద్దరి వివాహం జరగనుంది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు మా కొత్త ప్రయాణంపై ఉండాలని కోరుకుంటున్నాం’’ అంటూ ఆర్య ఓ ప్రకటనను విడుదల చేశాడు. కాగా అఖిల్ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయేషా.. ఆ తరువాత కోలీవుడ్‌లో వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ అక్కడే సెటిల్ అయ్యింది. ఈ క్రమంలో ఆర్య సరసన గజనీకాంత్(భలే భలే మగాడివోయ్ రీమేక్) అనే చిత్రంలో నటించగా.. అప్పటి నుంచి ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబ వర్గాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

Published On - 12:16 pm, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu