amitabh bachchan tweet : విరాట్- అనుష్క కూతురిపై అమితాబ్ ఆసక్తికర ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక క్రికెట్ అభిమానులు, సినిమా అభిమానులు..

amitabh bachchan tweet : స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక క్రికెట్ అభిమానులు, సినిమా అభిమానులు అందరు విరుష్క జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే విరుష్క కూతురు పై అమితాబ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. కొంతమంది ఈ ట్వీట్ ను లైక్ చేస్తుంటే మరికొంతమంది తప్పుబడుతున్నారు. ఇంతకు అంతలా ఆ ట్వీట్ లో ఏముందంటే..
మన క్రికెట్ టీమ్ అంతా కలిసి భవిష్యత్తులో మహిళల క్రికెట్ టీమ్‌ను తయారు చేస్తోందంటూ బిగ్ బీ తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ ట్వీట్ లో రైనా, గంభీర్, రోహిత్, షమి, రహానే, జడేజా, పుజారా, సాహా, భజ్జీ, నటరాజన్, ఉమేష్ యాదవ్‌ల పేర్లు రాసి అందరికి ఆడపిల్లలు పుట్టారని అలాగే ధోనికి కూడా కూతురు పుట్టింది. ఇప్పుడు విరాట్ కోహ్లీకి కూడా కూతురు పుట్టింది వీళ్లంతా భవిష్యత్తు మహిళల క్రికెట్ టీమ్‌ను తయారు చేస్తున్నారని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు అమితాబ్. ఈ ట్వీట్ పై కొంతమంది పాజిటివ్ గా కామెంట్ చేస్తుంటే మరికొంతమంది క్రికెట్ లోకి కూడా వారసత్వాన్ని ఎందుకు తీసుకువస్తున్నారంటూ మండిపడుతున్నారు.
T 3782 – An input from Ef laksh ~
“… and Dhoni also has daughter .. will she be Captain ? ?” pic.twitter.com/KubpvdOzjt
— Amitabh Bachchan (@SrBachchan) January 13, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
Venkatesh’s ‘Narappa’ : కుటుంబ సభ్యులతో విహారయాత్రలో ఉల్లాసంగా ‘నారప్ప’.. ఆకట్టుకుంటున్న పోస్టర్..