Kriti Sanon: అమితాబ్ ఇంట్లో అద్దెకు దిగిన కృతి సనన్.. రెంట్ ఎంత చెల్లిస్తుందంటే..
మహేశ్ బాబుతో కలిసి 'వన్: నేనొక్కడినే', 'దోచెయ్' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది కృతి సనన్. ఆతర్వాత హిందీ పరిశ్రమకు వెళ్లి తన అదృష్టం పరీక్షించుకుంది

మహేశ్ బాబుతో కలిసి ‘వన్: నేనొక్కడినే’, ‘దోచెయ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది కృతి సనన్. ఆతర్వాత హిందీ పరిశ్రమకు వెళ్లి తన అదృష్టం పరీక్షించుకుంది. వరుసగా విజయాలు సొంతం చేసుకుంది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ‘మిమీ’లో సరోగసీ మదర్‌గా అద్భుతంగా అభినయించి విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘ఆదిపురుష్’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. కాగా బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కృతి సనన్ ఇటీవల బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో అద్దెకు దిగిందట. ముంబయిలోని అంధేరీ వెస్ట్‌లోని లోఖండ్ వాలా రహదారిలో ఉన్న అట్లాంటిస్ బిల్డింగ్‌లో బిగ్‌బీకి ఒక డ్యూప్లెక్స్ ఫ్లాట్ ఉంది. ఇందులోనే కృతి అద్దెకు ఉంటోందట. కాగా ఈ ఫ్లాట్ కోసం అద్దెగా కృతి సుమారు ఆమె రూ. 10లక్షలు చెల్లించనుందట. అదేవిధంగా సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.60లక్షలు చెల్లించిందని తెలుస్తోంది. ఈమేరకు బిగ్‌బీ, కృతిల మధ్య అగ్రిమెంట్ కూడా జరిగిందని సమాచారం.
ఈ ఒప్పందం ప్రకారం రెండేళ్ల పాటు అంటే 2021 అక్టోబర్ 16 నుంచి 2023 అక్టోబర్ 15 వరకు ఈ డ్యూప్లెక్స్ ఫ్లాట్ కృతి ఆధీనంలో ఉంటుందట. కాగా బిగ్ బీ రూ.31కోట్లు వెచ్చించి ఈ డ్యూప్లెక్స్ ఫ్లాట్‌ను కొన్నారు. దీంతో పాటు జుహులో వత్స, అమ్ము అనే రెండు భవంతులు కూడా అమితాబ్‌పేరిట ఉన్నాయి. వీటిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 15ఏళ్ల పాటు అద్దెకిచ్చారు. వీటి నుంచి అద్దె రూపంలో నెలకు రూ.18.9 లక్షలు వస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం కృతి సొంతం చేసుకున్న ఫ్లాట్ కోసం పలువురు సెలబ్రిటీలు ట్రై చేశారట. కానీ చివరకు కృతికే ఆ అవకాశం దక్కిందట. కాగా వెస్ట్ అంధేరిలో ఉన్న అట్లాంటిస్ బిల్డింగ్స్‌లో ఉండేందకు సెలబ్రిటీలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇదే అట్లాంటిస్‌లో సన్ని లియోన్ 12వ అంతస్థులో ఓ అపార్ట్‌మెంట్‌ని రూ. 16 కోట్లకు కొనుగోలు చేసింది.
Also read:
Genelia D’Souza: మళ్ళీ కెమెరా ముందుకు హా..హా..హాసినీ.. జెనీలియా రీ ఎంట్రీ ఏ సినిమాతోనంటే..!!
Radhe Shyam: అందమైన పాటకు అద్భుతమైన స్పందన.. దూసుకుపోతున్న ‘రాధే శ్యామ్’ సోచ్ లియా సాంగ్
Katrina Kaif- Vicky Kaushal: ఒక్కటైన బాలీవుడ్ ప్రేమజంట.. వేడుకగా విక్ట్రీనాల వివాహం..
