ప్రముఖ భారతీయ డ్యాన్సర్ అమలా శంకర్ కన్నుమూత
ప్రముఖ భారతీయ డ్యాన్సర్, దివంగత ఉదయ్ శంకర్(నాట్యకారుడు) సతీమణి అమలా శంకర్(101) ఇక లేరు. శుక్రవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ భారతీయ డ్యాన్సర్, దివంగత ఉదయ్ శంకర్(నాట్యకారుడు) సతీమణి అమలా శంకర్(101) ఇక లేరు. శుక్రవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. 1919లో జెస్సోరీ(ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న ఓ ప్రాంతం)లో అమలా జన్మించారు. 1930 నుంచి అమలా డ్యాన్స్‌ని నేర్చుకున్నారు. ఇక 1931లో పారిస్‌లోని ఇంటర్నేషనల్ కోలోనియల్ ఎగ్జిబిషన్‌లో అమలా, ఉదయ్ శంకర్‌ని మొదటి సారిగా కలిశారు. ఆ తరువాత ఉదయ్ శంకర్ డ్యాన్స్ గ్రూప్‌లో చేరిన అమలా.. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉదయ్, అమలా మధ్య ప్రేమ చిగురించగా.. 1942లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా ఈ ఇద్దరు తమ ప్రదర్శనలను కొనసాగించారు. అంతేకాదు ఎంతోమందికి అమలా డ్యాన్స్‌ను నేర్పించారు. ఇదిలా ఉంటే ఆమె మరణవార్తపై స్పందిస్తోన్న పలువురు అమలా కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు.



