AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పుష్ప’ నుంచి విజయ్ తప్పుకోవడానికి గల కారణమిదేనా..!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప సినిమా షూటింగ్‌ ఆ మధ్యనే ప్రారంభమైంది. అయితే అల వైకుంఠపురములో బిజీగా ఉండటం వలన ఈ మూవీ షూటింగ్‌లో బన్నీ ఇంకా పాల్గొనలేదు.

'పుష్ప' నుంచి విజయ్ తప్పుకోవడానికి  గల కారణమిదేనా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 19, 2020 | 8:40 PM

Share

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప సినిమా షూటింగ్‌ ఆ మధ్యనే ప్రారంభమైంది. అయితే అల వైకుంఠపురములో బిజీగా ఉండటం వలన ఈ మూవీ షూటింగ్‌లో బన్నీ ఇంకా పాల్గొనలేదు. ఇక ఇప్పుడు లాక్‌డౌన్‌తో మూవీ షూటింగ్ వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ మూవీ యూనిట్‌కు కోలీవుడ్ నటుడు విజయ్‌ సేతుపతి షాక్‌ ఇచ్చారని, ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే డేట్లు అడ్జెస్ట్ అవ్వకపోవడం వల్లే ఈ మూవీ నుంచి విజయ్‌ తప్పుకున్నట్లు టాక్‌ నడించింది. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన బయటకు వెళ్లడానికి మరో కారణం ఉందట.

పుష్పకు విజయ్‌ను ఫైనల్ చేసినప్పుడు.. తెలుగులో మాత్రమే ఈ సినిమాను తీయబోతున్నట్లు తెలిపారట. అయితే బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడంతో పాటు.. ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో విజయ్‌ షాక్‌కు గురయ్యారట. ప్రస్తుతం విజయ్‌ కోలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే కొన్ని చిత్రాల్లో విలన్‌ పాత్రలను కూడా చేశారు. ఇలయ దళపతి హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న మాస్టర్ చిత్రంలోనూ విజయ్‌ సేతుపతి విలన్‌గా కనిపిస్తున్నారు.

అయితే వరుసగా విలన్ పాత్రలు చేస్తే అది తన హీరో కెరీర్‌పై ప్రభావం చూపుతుందని భావించిన విజయ్‌.. పుష్ప విషయంలో నటించలేనని చెప్పారట. ఒకవేళ తమిళ భాషలో సినిమాను రిలీజ్ చేయకపోతే.. ఇందులో నటిస్తానని సుకుమార్‌కు చెప్పారట. లేకపోతే తమిళ భాష కోసం మరో నటుడిని పెట్టాలని సూచించారట. అయితే ఐదు భాషల్లో రాబోతున్న ఈ మూవీలో ఒక భాషలో ఒక పాత్ర కోసం ఇంకో నటుడిని తీసుకోవడం కష్టమని భావించిన సుకుమార్.. విజయ్‌ నిర్ణయంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మరోవైపు ఈ పాత్ర కోసం సుశీల్ శెట్టి, బాబీ సింహా, ధనుంజయ తదితర పేర్లను పరిశీలిస్తున్నట్లు కూడా సమాచారం. మరి ఈ మూవీలో ఎవరెవరు నటించబోతున్నారు..? పుష్ప ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది..? అనే విషయాలకు త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Read This Story Also: మహేష్‌కు ముందు అతడితో డేటింగ్.. నమ్రత ఏం చెప్పిందంటే..!

Follow Us
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్