బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 19వ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టైటిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు దర్శకనిర్మాతలు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15న అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ టైటిల్‌ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం‘నాన్న నేను’, ‘అలకనంద’ అనే టైటిల్స్ వినిపించిన విషయం తెలిసిందే. కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న […]

బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2019 | 6:37 PM

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 19వ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టైటిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు దర్శకనిర్మాతలు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15న అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ టైటిల్‌ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం‘నాన్న నేను’, ‘అలకనంద’ అనే టైటిల్స్ వినిపించిన విషయం తెలిసిందే.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. టబు, జయరామ్, నివేథా పేతురాజ్, నవదీప్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.