Allu Arjun: స్నేహా బర్త్‌డే వేడుకను బన్నీ ఎంత గ్రాండ్‌గా చేశారో చూశారా.. ‘నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి’ అంటూ..

Allu Arjun: టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్‌ అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు ఒకరు. స్నేహితులుగా మొదలైన వీరి ప్రయాణం పెళ్లి వరకు విజయవంతంగా కొనసాగింది. పెద్దలను ఒప్పించిన ఈ లవ్‌ బర్డ్స్‌ 2011, మార్చి 6న...

Allu Arjun: స్నేహా బర్త్‌డే వేడుకను బన్నీ ఎంత గ్రాండ్‌గా చేశారో చూశారా..  'నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి' అంటూ..
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Sep 29, 2021 | 4:12 PM

Allu Arjun: టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్‌ అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు ఒకరు. స్నేహితులుగా మొదలైన వీరి ప్రయాణం పెళ్లి వరకు విజయవంతంగా కొనసాగింది. పెద్దలను ఒప్పించిన ఈ లవ్‌ బర్డ్స్‌ 2011, మార్చి 6న వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అన్యోన్యతకు మారుపేరుగా ఉంటారు ఈ క్యూట్‌ కపుల్స్‌. పెళ్లై ఇన్నేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ కొత్త జంటలాగే కనిపిస్తుంటారు. సినిమాలతో నిత్యం బిజీగా ఉండే బన్నీ కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు స్నేహారెడ్డితో పాటు ఇద్దరు పిల్లలతో (ఆయాన్‌, ఆర్హా) జాలీగా గడుపుతుంటారు.

ఇదిలా ఉంటే నేడు (సెప్టెంబర్‌ 29న) స్నేహా రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా భార్య పుట్టిన రోజు వేడుకలను బన్నీ ఘనంగా నిర్వహించారు. రాత్రి పూట స్నేహతో కేక్‌ కట్‌ చేయించి సందడిగా గడిపారు. ఈ వేడుకకు అత్యంత దగ్గరి సన్నిహితులు హాజరైనట్లు తెలుస్తోంది. వేడుకలకు సంబంధించిన ఫొటోను ట్వీట్‌ చేసిన బన్నీ.. ‘నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తికి (స్నేహారెడ్డి) జన్మదిన శుభాకాంక్షలు. నీతో కలిసి మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే క్యూటీ’ అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ పోస్టుకు పలువురు సెలబ్రిటీలతో పాటు బన్నీ ఫ్యాన్స్‌ స్పందిస్తున్నారు. స్నేహారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే స్నేహారెడ్డికి కూడా సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోయింగ్‌ ఉందన్న విషయం తెలిసిందే. బన్నీ సినిమా అప్‌డేట్స్‌తో పాటు కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు స్నేహారెడ్డి. ఈ క్రమంలోనే స్నేహ టాలీవుడ్‌ సెలబ్రిటీల వైఫ్‌లలో అత్యధిక ఫాలోవర్స్‌ (ఇన్‌స్టాగ్రామ్‌లో) ఉన్న వ్యక్తిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్నేహాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Also Read: Naga Chaitanya: మా ప్రయాణం ఆగిపోతుందని బాధగా ఉంది.. ఈ జర్నీని ఆపొద్దు.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..

Amala Paul: అమలా పాల్ బికిని డ్రెస్‌పై ట్రోల్స్.. నా డ్రెస్ నా ఇష్టమంటూ తిప్పికొట్టిన బ్యూటీ.

Nagarjuna: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నాగార్జున విజ్ఞప్తి.. లవ్ స్టోరీ సక్సెస్ మీట్‏లో ఏమన్నారంటే..