AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buchi Babu: మరో స్టార్ హీరో కోసం పెద్ది డైరెక్టర్స్ ప్రయత్నాలు.. బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా ఆయనతోనేనా..

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, డైరెక్టర్ దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. జూన్ 4న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

Buchi Babu: మరో స్టార్ హీరో కోసం పెద్ది డైరెక్టర్స్ ప్రయత్నాలు.. బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా ఆయనతోనేనా..
Buchi Babu
Rajeev Rayala
|

Updated on: Jun 08, 2026 | 2:16 PM

Share

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేసి ఆతర్వాత దర్శకుడిగా మారారు బుచ్చిబాబు సన. మెగా ఫ్యామిలి నుంచి వైష్ణవ్ తేజ్ ను హీరోగా పెట్టి కృతి శెట్టి హీరోయిన్ గా ఉప్పెన అనే సినిమాను తెరకెక్కించారు, చిన్న సినిమాగా వచ్చిన ఉప్పెన పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఏకంగా రూ. 100కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బుచ్చిబాబు చాలా కాలం ఎదురుచూసి రామ్ చరణ్ తో సినిమా చేశారు. అదే పెద్ది. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూన్ 4న పెద్ది సినిమా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి షో నుంచి పెద్ది సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. విడుదలైన నాలుగు రోజులకే పెద్ది సినిమా రూ. 300కోట్లకు చేరువైంది.

పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ మూవీ అన్ని ఏరియాల నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ జాన్వికపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే జగపతిబాబు, శివ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుండటంతో దర్శకుడు బుచ్చిబాబు పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగుతుంది.

బుచ్చిబాబు నెక్స్ట్ ఏ హీరోతో కలిసి సినిమా చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవలే పెద్ది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ మీరు మహేష్ బాబుకు కథ చెప్పారంట.. నెక్ట్స్ ఆయనతోనే సినిమా ఉంటుందా అని ప్రశ్నించారు. దానికి బుచ్చిబాబు సమాధానంగా.. అదేనండి చర్చలు జరుగుతున్నాయి. ఇంకా కాలేదండీ.. జరుగుతుందండీ.. చెప్తా అని అన్నారు అలాగే మహేష్ సినిమాలోనూ ఎదో ఇక అవయవం కట్ చేస్తారా.? అని అడగ్గా.. బుచ్చిబాబు నవ్వేసి అలాంటిది ఏమీ లేదండీ.. సినిమా కథలో ఏముంటే అదే వస్తుంది అని చెప్పారు. దాంతో బుచ్చిబాబు మహేష్ బాబుతో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని క్లారిటీ వచ్చేసింది. కాగా మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు వారణాసి అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేసారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us