Manav Suthar: ‘గుజరాత్ కోటా’ అని మొరిగినోళ్ల నోళ్లు మూయించాడుగా..! ఎవరీ మానవ్ సుతార్?
ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 564 పరుగుల భారీ స్కోర్ చేసిన టీమిండియా, ఆఫ్ఘాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆఫ్ఘాన్‌ను కుప్పకూల్చడంలో కొత్త కుర్రాడు, తొలి మ్యాచ్ ఆడుతున్న మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు.

ముల్లాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 564 పరుగుల భారీ స్కోర్ చేసిన టీమిండియా, ఆఫ్ఘాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆఫ్ఘాన్‌ను కుప్పకూల్చడంలో కొత్త కుర్రాడు, తొలి మ్యాచ్ ఆడుతున్న మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్‌లో తొలి టెస్ట్ ఆడుతూ 22 ఓవర్లు వేసి కేవలం 33 రన్స్ ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనత సాధించింది ఆఫ్ఘనిస్థాన్ లాంటి చిన్న టీమ్‌పైనే అయినా.. డెబ్యూ మ్యాచ్‌లో ఇలాంటి ప్రదర్శన నిజంగా గొప్ప విషయమే చెప్పాలి.
విమర్శలకు సమాధానం..
కాగా మానవ్ సుతార్‌ను టీమిండియాకు ఎంపిక చేసిన సమయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన ఆటగాళ్లనే టీమిండియాలోకి తీసుకుంటున్నారని, మానవ్ సుతార్‌కు కూడా అలాగే గుజరాత్ కోటాలో స్థానం దక్కిందంటూ హేళన చేస్తూ సోషల్ మీడియా వేదికగా చాలా మంది కామెంట్లు చేశారు. ఇప్పుడు తన ప్రదర్శనతోనే మానవ్ వాళ్లందరికీ సమాధానం చెప్పినట్లు అయింది. ఇప్పటికే టీమిండియాకు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్ దూరం అవ్వడంతో మానవ్ సుతార్ లాంటి ప్లేయర్ అవసరం అని కొంతమంది గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి యువ క్రికెటర్లు అవకాశం ఇస్తేనే కదా వాళ్లని వాళ్లు నిరూపించుకునేది. ఇప్పటికైనా సుతార్‌ను గుజరాత్ కోటా ప్లేయర్ అనడం మానేస్తే బెటర్ అంటూ మరికొంతమంది క్రికెట్ లవర్స్ అంటున్నారు.
A dream promised, a dream fulfilled. And he’s just getting started! 🇮🇳 pic.twitter.com/fZwnnh5gJy
— Gujarat Titans (@gujarat_titans) June 8, 2026
సుతార్ నేపథ్యం..
రాజస్థాన్‌కు చెందిన మానవ్ సుతార్ ఒక సాంప్రదాయక లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్. అతను లోయర్-ఆర్డర్‌లో బ్యాటింగ్ కూడా చేయగలడు. 2022-23 రంజీ ట్రోఫీ సీజన్‌లో సుతార్ 6 మ్యాచ్‌లలో 20.33 సగటుతో 39 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను ఆ సీజన్‌లో రాజస్థాన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అదే సీజన్‌లో అతను రెండు హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు.
You only get one debut, and Manav Suthar made sure history remembers it 🤍
Updates ▶️ https://t.co/Au50EfVM30#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/GRmzbLFbzO
— BCCI (@BCCI) June 8, 2026
2023 ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ కప్‌కు ఎంపికయ్యాడు, ఆ టోర్నమెంట్‌లో 5 మ్యాచ్‌లలో 19.50 సగటు, 4.21 ఎకానమీ రేటుతో 10 వికెట్లు తీసి, సంయుక్తంగా రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024 కోసం సుతార్‌ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది, అక్కడ అతను ఒక మ్యాచ్ ఆడినప్పటికీ, అది అతనికి నిరాశాజనకంగా మిగిలింది. 2024లో జరిగిన దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో సుతర్ ఏడు వికెట్లు (7/49) తీసి మ్యాచ్ గెలిపించే ప్రదర్శన కనబరిచాడు. దీంతో GT 2025 IPL వేలంలో అతడిని మరోసారి 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.
The man of the moment applauded by one and all 🤩
📸 Frames from Manav Suthar’s 𝗺𝗲𝗺𝗼𝗿𝗮𝗯𝗹𝗲 𝗺𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲! 👏
Scorecard ▶️ https://t.co/Au50EfVM30#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/gIVvVTgAQS
— BCCI (@BCCI) June 8, 2026
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
