AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagapathi Babu : జాన్వీని ట్రోల్ చేయొద్దు.. ఆ అమ్మాయి తప్పేమి లేదు.. ట్రోల్స్ పై జగపతి బాబు రియాక్షన్..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సినిమా పెద్ది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. రామ్ చరణ్ యాక్టింగ్, జగపతి బాబు, శివరాజ్ కుమార్ పాత్రలు, బుచ్చిబాబు డైరెక్షన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఈ సినిమాలో జాన్వీ పాత్ర, ఆమె గ్లామరస్ సీన్స్ గురించి సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ ట్రోల్స్ పై స్పందించారు విలక్షణ నటుడు జగపతి బాబు.

Jagapathi Babu : జాన్వీని ట్రోల్ చేయొద్దు.. ఆ అమ్మాయి తప్పేమి లేదు.. ట్రోల్స్ పై జగపతి బాబు రియాక్షన్..
Jagapathi Babu, Janhvi Kapo
Rajitha Chanti
|

Updated on: Jun 08, 2026 | 1:39 PM

Share

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ‘పెద్ది’. జూన్ 4న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.292 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి థియేటర్లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇందులో అప్పలసూరి పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. కానీ ఈ మూవీ విడుదలయ్యాక ఆమె పాత్రపై నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. కేవలం గ్లామరస్ సీన్లు మాత్రమే ఉన్నాయని.. నటనకు, పాత్రకు ప్రాధాన్యత లేదని విమర్శిస్తున్నారు. దీంతో నెట్టింట జాన్వీ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ‘పెద్ది’ చిత్రంపై తనకున్న ప్రేమను చాటుకోవడంతో పాటు సోషల్ మీడియాలో హీరోయిన్ జాన్వీ కపూర్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించి, ఆమెకు అండగా నిలిచారు.

ఎక్కువ మంది చదివినవి : Sirivennela Sitaramasastri : మనిషి జీవితంలో ఎదగటానికి ఈ లక్షణాలు ఉంటే చాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..

ఆ ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ.. “సినిమా విషయాల్లో నటీనటులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయవద్దు. పాపం ఆ అమ్మాయి ఏమి చేసింది? నువ్వు ఇది చెయ్యి అంటేనే కదా తను చేస్తుంది. ఆర్టిస్టుగా ఒక డైరెక్టర్ మాట వినాలి మనం. డైరెక్టర్ చెప్పింది చేస్తాం. ఆ అమ్మాయి కూడా దర్శకుడు ఏం చెబితే అది చేసింది. కొన్నిసార్లు మనం అనుకున్నది స్క్రీన్‌పై మిస్‌ఫైర్ కావచ్చు. అంతమాత్రానికే ఒక వ్యక్తిని మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదు. ఈ విషయంలో నేను జాన్వీకపూర్‌కు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను” అంటూ నెటిజన్లను కోరారు.

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: ఒకప్పుడు లవర్ బాయ్.. వడ్డె నవీన్ కొడుకును చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..

తానేదో కేవలం సినిమాలు చేసుకుంటూ వెళ్లే వ్యక్తిని కాదని, ‘పెద్ది’ చిత్రంపై ఎంతో ప్రాణం పెట్టుకున్నానని తెలిపారు. “సినిమా విడుదలయ్యాక పరిశ్రమకు చెందిన ఒక పెద్ద దర్శకుడు నాకు ఫోన్ చేసి, ఇంత గొప్ప పాత్ర చేసినా మిమ్మల్ని ఎందుకు ఎవరూ గుర్తించట్లేదు? అదే పరభాషా నటులు చేసి ఉంటే ఆకాశానికి ఎత్తేసేవారు కదా! అని అడిగారు. నేను కూడా దర్శకుడు బుచ్చిబాబును ఇదే ప్రశ్న అడిగాను. షూటింగ్ సమయంలో ప్రతి షాట్‌కు చప్పట్లు కొట్టిన వాళ్లు, ఇప్పుడు నన్ను మర్చిపోతున్నారా అని అన్నాను. ఎందుకంటే ఈ పాత్ర కోసం నేను అంతగా కష్టపడ్డాను, గుర్తింపు కోరడంలో తప్పులేదు” అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

Follow Us