Nayanthara: నయన్ ఇంటికి కళ్లు చెదిరే భారీ బడ్జెట్.. తగ్గేదే లే అంటున్న కేరళ కుట్టి

దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార.. మొన్నీమధ్యే ఏడడుగులు నడిచారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చినా..

Nayanthara: నయన్ ఇంటికి కళ్లు చెదిరే భారీ బడ్జెట్.. తగ్గేదే లే అంటున్న కేరళ కుట్టి
Nayanthara And Vignesh Shivan
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 06, 2022 | 6:39 PM

పెళ్లి చేసుకుని.. ఇల్లు చూసుకుని.. చల్లగా కాలం గడపాలోయ్ అంటూ పెద్దాయన ఎన్టీఆర్ అప్పట్లో పెళ్లి చేసి చూడు అనే సినిమాలో చెప్పారు. నయనతార ఇప్పుడిదే ఫాలో అవుతున్నారు. పెళ్లికి ముందు ఓ ఇల్లు కొనుక్కున్నా.. తాజాగా మరో ఇంటిని కూడా కొనేసినట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు ఆ ఇంటి కోసం ఓ భారీ బడ్జెట్ సినిమాకు అయ్యే ఖర్చే పెడుతుంది ఈ ముద్దుగుమ్మ. మరి నయన్ కొత్తింటి ముచ్చట్లేంటి.. ప్రత్యేకతలేంటి..? ఐదేళ్ళ ప్రేమను ఈ మధ్యే పెళ్లి బంధంగా మార్చుకుని.. హాయిగా హనీమూన్ కూడా వెళ్లొచ్చారు నయనతార. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ.. మొన్నీమధ్యే ఏడడుగులు నడిచారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చినా.. రెండు వారాల్లోనే మళ్లీ షూటింగ్స్‌కు వచ్చేసారు నయన్. ఇదిలా ఉంటే తాజాగా కొత్త కాపురంపై ఫోకస్ చేశారు నయన్. దానికోసం కోట్లు ఖర్చు చేసి ఇల్లు తీసుకున్నారు.

ఇప్పటికే నయనతార చెన్నైలోని ఖరీదైన పొయెస్ గార్డెన్‌లో ఓ బంగ్లాను కొన్నారు. చాలా రోజుల కిందే ఈ న్యూస్ వైరల్ అయింది. అయితే పెళ్ళి తర్వాత భర్త పేరుతో మరో బంగ్లాను కూడా నయన్ కొనేసిందనే ప్రచారం జరుగుతుంది. రజినీ, శశికళ, అజిత్ లాంటి ప్రముఖులు అక్కడే ఉన్నారు. ఈ ప్లేస్‌లోనే నయన్ కూడా కోట్లు ఖర్చు చేసి రెండు ఇళ్ళను తీసుకున్నారు. ఇప్పుడు వాటి ఇంటీరియర్ కోసమే 25 కోట్లు ఖర్చు చేస్తుండటం తమిళనాట చర్చనీయాంశంగా మారిపోయింది. నయనతార కొనుగోలు చేసిన ఈ రెండు ఇళ్ళకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఒక్కో ఇల్లు దాదాపు 8000 చదరపు అడుగుల స్థలంలో ఉంటుందని.. అందులో కేవలం స్విమ్మిగ్ పూల్‌ మాత్రమే 1500 చదరపు అడుగుల్లో ఉంటుందని తెలుస్తుంది. పైగా వీటిలో కేవలం నయన్, విగ్నేష్ కోసమే ఓ లిఫ్ట్.. పని వాళ్ళకి ప్రత్యేకంగా మరో లిఫ్ట్ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే కొత్తింట్లోకి వెళ్లి కొత్త కాపురం మొదలుపెట్టాలని చూస్తున్నారు ఈ జోడీ. ఏదేమైనా నయన్ కొత్తింటి మ్యాటర్ మాత్రం వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..

ఇవి కూడా చదవండి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..