Prabhas: మరో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతోన్న డార్లింగ్.. ఈసారి ఇంటర్నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన ప్రభాస్..
Prabhas: సినిమాలు తారలు వ్యాపారాలు చేయడం సర్వసాధారణమైన విషయం. అయితే గతంలో ఎక్కువగా సినిమాల్లో సంపాదించిన డబ్బులను నిర్మాతగా మారి సినిమాల్లో పెట్టుబడులుగా పెట్టడమో.. రియల్ ఎస్టేట్ వంటి వాటిని చేస్తుండే వారు...

Prabhas: సినిమాలు తారలు వ్యాపారాలు చేయడం సర్వసాధారణమైన విషయం. అయితే గతంలో ఎక్కువగా సినిమాల్లో సంపాదించిన డబ్బులను నిర్మాతగా మారి సినిమాల్లో పెట్టుబడులుగా పెట్టడమో.. రియల్ ఎస్టేట్ వంటి వాటిని చేస్తుండే వారు. కానీ ప్రస్తుతం యంగ్ జనరేషన్ ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. నటీమణులు ఎక్కువగా జిమ్, ఫిట్‌నెస్ రంగాల్లో పెట్టుబడులు పెడుతుంటే.. హీరోలు హోటల్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు ఫుడ్ బిజినెస్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
అయితే ఇవి కేవలం మన దేశానికే పరిమితమయ్యాయి. అయితే తాజాగా ప్రభాస్ ఏకంగా ఇంటర్నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దుబాయ్, స్పెయిన్‌లో భారీ హోటల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌ను మొదట దుబాయ్‌లో మొదలు పెట్టనున్నారని ఆ తర్వాత స్పెయిన్‌లోనూ హోటల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ భారీ ఎత్తున చేపడుతోన్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన మరికొందరు స్టార్ హీరోలు కూడా భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పటికే తన స్నేహితులతో కలిసి ఓ భారీ మల్టీప్లెక్సుతో పాటు, యూవీ క్రియేషన్స్ పేరుతో సినిమా రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. మరి ప్రభాస్ ఈ ఇంటర్నేషనల్ హోటల్ బిజినెస్ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ అశ్విన్ దర్శకత్వంలో మిస్టర్ కే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సాలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాలో నటిస్తోన్న విషయం తెఇలసిందే. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో, సందీప్ రెడ్డితో సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇవన్నీ పాన్ ఇండియా లెవల్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఆదిపురుష్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..