అఫీషియల్: శర్వా మహాసముద్రంలో ‘అదితీ’
శర్వానంద్‌తో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న మూవీ మహా సముద్రం. సిద్ధార్థ్ ఇందులో కీలక పాత్రలో నటించనున్నారు.
Aditi in Mahasamudram: శర్వానంద్‌తో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న మూవీ మహా సముద్రం. సిద్ధార్థ్ ఇందులో కీలక పాత్రలో నటించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో నటించబోతున్న వారి వివరాలను ఒక్కొక్కరిగా ప్రకటిస్తున్నారు. ఇక తాజాగా ఇందులో హీరోయిన్‌గా అదితీ రావు హైదరీని కన్ఫర్మ్ చేసింది మూవీ యూనిట్. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు.
”ప్రతి ప్రకటనతో మహాసముద్రం మరింత పెద్దదవుతోంది. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.ఇప్పుడు అద్భుతమైన, అందమైన అదితీ రావు హైదరీ ఇందులో హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయ్యింది. ఇందుకోసం పలువురిని పేర్లను పరిశీలించి చివరకు అదితీని ఫిక్స్ చేశాము. ఈ పాత్రకు అదితీ చక్కగా సరిపోతుంది. ఇందులో నటించేందుకు అదితీ కూడా చాలా ఎదురుచూస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ మూవీని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు” అని ఆ ప్రకటనలో తెలిపారు.
Read More: