భయపట్టే తాప్సీ సినిమా.. ‘గేమ్ ఓవర్’
ప్రముఖ కథానాయిక తాప్సీ ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరుతో సినిమా తెరకెక్కిన విషయం విదితమే. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, ఎస్ శశికాంత్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200లకు పైగా స్క్రీన్స్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏకకాలంలో జూన్ 14న విడుదల కానుంది. ఇంతకు ముందే విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాకుండా ఎప్పుడూ రాని సరికొత్త […]

ప్రముఖ కథానాయిక తాప్సీ ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరుతో సినిమా తెరకెక్కిన విషయం విదితమే. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, ఎస్ శశికాంత్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200లకు పైగా స్క్రీన్స్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏకకాలంలో జూన్ 14న విడుదల కానుంది. ఇంతకు ముందే విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాకుండా ఎప్పుడూ రాని సరికొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని, పూర్తి హార్రర్, సస్పెన్స్‌తో కూడినదని, ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని చిత్ర నిర్మాత శశికాంత్ పేర్కొన్నారు.