ఆఫ్రికాలో హాయి.. హాయిలే..హల !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కామినేని ఇటీవల ఆఫ్రికాలో ఎంజాయ్ చేశారు. తమ ప్రీ-వెడ్డింగ్ యానివర్సరీ ట్రిప్ ని ఆ దేశంలో చిరస్మరణీయంగా గడిపారు. (ఈ నెల 14 తో వీరి వివాహమై ఏడేళ్లు పూర్తవుతాయి). ఆఫ్రికాలోని టాంజానియాలో జరిపిన స్పెషల్ ట్రిప్ సందర్భంగా అక్కడి… వన్ నేచర్ న్యారుస్ విగ లగ్జరీ సఫారీ పార్క్ లోను, నెరెంగిటీ నేషనల్ పార్కులోను తమ జంగిల్ సఫారీ దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను ఉపాసన […]

ఆఫ్రికాలో హాయి.. హాయిలే..హల !
Pardhasaradhi Peri

|

Jun 05, 2019 | 4:50 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కామినేని ఇటీవల ఆఫ్రికాలో ఎంజాయ్ చేశారు. తమ ప్రీ-వెడ్డింగ్ యానివర్సరీ ట్రిప్ ని ఆ దేశంలో చిరస్మరణీయంగా గడిపారు. (ఈ నెల 14 తో వీరి వివాహమై ఏడేళ్లు పూర్తవుతాయి). ఆఫ్రికాలోని టాంజానియాలో జరిపిన స్పెషల్ ట్రిప్ సందర్భంగా అక్కడి… వన్ నేచర్ న్యారుస్ విగ లగ్జరీ సఫారీ పార్క్ లోను, నెరెంగిటీ నేషనల్ పార్కులోను తమ జంగిల్ సఫారీ దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. నెరెంగిటీ పార్కులో సింహం పిల్లలు గడ్డిలో సేద దీరుతుండగా తాము అతి దగ్గరలోనే డేర్ డెవిల్ సెల్ఫీ తీసుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. అదొక మరపురాని అనుభూతి, అనుభవమని, ఈ ట్రిప్ ని జీవితంలో మరచిపోలేమని ఉపాసన అన్నారు. ప్రతి వెడ్డింగ్ యానివర్సరీకి ఏదో ఓ కొత్త అడ్వెంచర్ చేయాలన్నది తమ కోర్కె అని, ఈ సారి తమ ప్రీ-యానివర్సరీ ఆఫ్రికాలో జరుపుకోవడం థ్రిల్లింగ్ గా ఉందని ఆమె అన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu