AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: అల్లు అర్జున్‌ను ఉద్దేశిస్తూ సమంత ఆసక్తికర పోస్ట్‌.. ఇకపై నిన్ను ఎప్పటికీ నమ్ముతాను అంటూ..

Samantha: తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు నటి సమంత. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన 'పుష్ప' చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో నటించిన సమంత ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు..

Samantha: అల్లు అర్జున్‌ను ఉద్దేశిస్తూ సమంత ఆసక్తికర పోస్ట్‌.. ఇకపై నిన్ను ఎప్పటికీ నమ్ముతాను అంటూ..
Narender Vaitla
|

Updated on: Dec 29, 2021 | 9:58 AM

Share

Samantha: తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు నటి సమంత. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో నటించిన సమంత ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ‘ఊ అంటావా ఊఊ అంటావా’ అంటూ కుర్రకారును మెస్మరైజ్‌ చేసింది సమంత. పుష్ప ప్రమోషన్స్‌ అప్పటి వరకు ఒక రేంజ్‌లో ఉంటే.. ఈ పాట బయటకు వచ్చిన తర్వాత మరో రేంజ్‌లో దూసుకుపోయింది. పుష్ప సినిమా విజయంలో సమంత స్పెషల్‌ సాంగ్‌ కూడా కీలక పాత్ర పోషించదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో రికార్డు దిశగా దూసుకుపోతోంది. ఇక సమంతకు ప్రేక్షకుల నుంచే కాకుండా ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా పుష్ప థ్యాంక్స్‌ మీట్‌లో అల్లు అర్జున్‌ కూడా సమంతపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. ‘సమంత గారు ఈ పాట చేసినందుకు ధన్యవాదాలు. ఈ పాటను మీరెంతగా నమ్మారో కానీ.. మా మీద నమ్మకంతో చేశారు చూడండి దానికి ధన్యవాదాలు. నాకు తెలుసు మీకు సెట్‌లో ఎన్నో అనుమానులు వచ్చాయి. కానీ నేను నన్ను నమ్మండి, చేయండి అని చెప్పాక మీరు నన్ను ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. నన్ను నమ్మి మీరు నా హృదయాన్ని, గౌరవాన్ని గెలుచుకున్నారు. అలాగే యూట్యూబ్‌లో ఈ పాట నంబర్ వన్‌గా నిలిచినందుకు మీకు అభినందనలు. ఇది మామూలు విషయం కాదు. ‘ఊ అంటావా ఉఊ అంటావా’ అంటే వేరే ఆప్షన్ లేకుండా అందరూ చచ్చినట్టు ‘ఊ’ అనాల్సిందే’ అని చెప్పుకొచ్చారు.

ఇక బన్నీ చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా సమంత స్పందించారు. అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన సమంత.. ‘నేను మిమ్మల్ని ఎప్పుడూ నమ్ముతాను’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే సమంత కనిపించిన ఈ స్పెషల్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డ్స్‌ తిరగరాస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఈ పాటను 8 కోట్లకుపైగా మంది వీక్షించడం విశేషం. మరి ఈ పాట సమంత కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

Also Read: Year Ender 2021: క్రీడా ప్రపంచంలో వివాదాలు.. ఈ ఏడాది ఆటగాళ్లను కుదిపేసిన విషయాలు ఇవే..!

Akhanda Movie: అఖండ చిత్రానికి సీక్వెల్‌ రానుందా.. నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి చెప్పిన సమాధానం ఇదే..

Road Accident: రక్తమోడుతున్న రహదారులు.. రెండు గంటల వ్యవధిలోనే మూడు ప్రమాదాలు..!