AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన సాయిపల్లవి..!

చలాకీ భామ సాయిపల్లవి తాజాగా నటించిన సినిమా ‘ఎన్జీకే’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో సూర్యకు జోడీగా పల్లవి ఈ సినిమాలో కనిపించింది. కాగా.. ఈ సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడు అభిమానులతో చిట్‌చాట్ చేయాలనీ, సినిమా విశేషాలను పంచుకోవాలని భావించిందట. అందుకు టైమ్‌ కూడా ఫిక్స్ చేసి సోషల్ మీడియాలో అభిమానులకు తెలియపరిచింది. అయితే.. కొన్ని కారణాల ఈ భామ అభిమానులతో చాట్ చేయలేకపోయింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం […]

ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన సాయిపల్లవి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 31, 2019 | 4:36 PM

Share

చలాకీ భామ సాయిపల్లవి తాజాగా నటించిన సినిమా ‘ఎన్జీకే’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో సూర్యకు జోడీగా పల్లవి ఈ సినిమాలో కనిపించింది. కాగా.. ఈ సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడు అభిమానులతో చిట్‌చాట్ చేయాలనీ, సినిమా విశేషాలను పంచుకోవాలని భావించిందట. అందుకు టైమ్‌ కూడా ఫిక్స్ చేసి సోషల్ మీడియాలో అభిమానులకు తెలియపరిచింది. అయితే.. కొన్ని కారణాల ఈ భామ అభిమానులతో చాట్ చేయలేకపోయింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ చాటింగ్ కోసం మేము ఎదురుచూస్తూంటే నువ్వు చీటింగ్ చేస్తావా..? అంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో.. అభిమానులకు సారీ చెప్పి, మళ్లీ సోషల్ మీడియాలో కలుద్దాం అంటూ సాయిపల్లవి తెలివిగా తప్పించుకుంది.

Follow Us