Sai Pallavi: ‘గార్గి’ అబ్బాయిలే ఎక్కువగా చూడాల్సిన సినిమా.. ఆసక్తికర విషయాలు పంచుకున్న సాయి పల్లవి..
Sai Pallavi: సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం 'గార్గి'. జులై 15న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సాయిపల్లవి నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి...

Sai Pallavi: సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం ‘గార్గి’. జులై 15న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సాయిపల్లవి నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర లభిస్తే తన సత్తా ఏంటో చాటుకునే సాయి పల్లవి, ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులకు కట్టిపడేసింది. నిజం కోసం పోరాడే యువతి పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయింది. ఇక గార్గి సినిమాకు వస్తోన్న స్పందనపై తాజాగా సాయిపల్లవి స్పందించింది.
గార్గి చిత్ర యూనిట్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్‌పై స్పందించారు. ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ..’గార్గి చూసిన వారంతా చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా మహిళల కోసం, అమ్మాయిల కోసమనే కాదు. అబ్బాయిలే ఎక్కువగా చూడాలి. సున్నితమైన విషయాల్ని దర్శకుడు అంతే సున్నితంగా చెప్పారు. ఈ సినిమాలో మా అందరి కంటే కథే పెద్ది. ఇలాంటి చిత్రాల్లో భాగం కావడమే ఎక్కువ తృప్తినిస్తుంది’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
సాధారణంగా తమ నటనా ప్రతిభని చూపించడం కోసం కొన్ని సినిమాలు చేస్తుంటామని తెలిపిన సాయిపల్లవి.. గార్గిని మాత్రం అవేవీ మనసులో పెటుకోకుండా కేవలం కథ కోసమే చేశానని తెలిపింది. తన ప్రయాణలో గార్గి ప్రత్యేకమని తెలిపిన బ్యూటీ.. తనకొచ్చే కథల్లో ఏది బాగుందనిపిస్తే అది చేస్తాను తప్ప, కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథల్నే చేయాలనే ఆలోచన ఉండదని తేల్చి చెప్పింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..



