Ritu Varma: ఆ విషయమంలో నా ఇష్టమే ఫైనల్.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రీతూ వర్మ.
Ritu Varma: పెళ్లీడుకు వచ్చిన ఎవరికైనా మొదట ఎదురయ్యే ప్రశ్న.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు.? అని.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఏదో ఒక సమయంలో..
Ritu Varma: పెళ్లీడుకు వచ్చిన ఎవరికైనా మొదట ఎదురయ్యే ప్రశ్న.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు.? అని.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్నను ఎదుర్కొనే ఉంటారు. అయితే ఈ ప్రశ్న మరీ ముఖ్యంగా హీరోయిన్లకు ఎక్కువగా ఎదురవుతుంటుంది. మీడియా ముందుకు వస్తే చాలు కచ్చితంగా పెళ్లికి సంబంధించిన ప్రశ్నను అడిగేస్తుంటారు. తాజాగా ఇలాంటి ప్రశ్ననే ఎదుర్కున్నారు నటి రీతూ వర్మ. ఈ ముద్దుగుమ్మ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘వరుడు కావలెను’. నాగశౌర్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమా శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగానే రీతూ కొన్ని ఇంటర్వ్యూలకు హాజరైంది. ఈ సమయంలో రీతూకు తన పెళ్లి ఎప్పుడన్న ప్రశ్న ఎదురైంది. రీతూ వర్మ పెళ్లి విషయమై స్పందిస్తూ.. తన పెళ్లికి ఇంకా సమయం ఉందని తేల్చి చెప్పారు. బహుశా మరో మూడేళ్లు పట్టొచ్చాని క్లారిటీ ఇచ్చేశారు. ఇక పెళ్లి విషయంలో తన ఇంట్లో కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టే వారు లేరని.. అప్పుడప్పుడు సరదాగా అంటుంటారని చెప్పుకొచ్చారు. అయితే తన పెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులు పూర్తిగా తనకే వదిలేశారని రీతూ చెప్పుకొచ్చారు.
ఇక తాను ప్రస్తుతం సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని, లవ్‌లో లేనని కూడా క్లారి ఇచ్చేశారు. ఇదిలా ఉంటే శుక్రవారం విడుదలతోన్న ‘వరుడు కావలెను’ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని దసరాకే విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాలతో సినిమా వాయిదా పడింది.
Also Read: Telangana: కొడుకు కాదు క్రూరుడు.. బ్రతికుండగానే తల్లికి ఖర్మకాండలు.. కన్నీటి పర్యంతమైన మాతృమూర్తి
Lalu Prasad Yadav: సర్కార్‌ను గంగలో కలిపేయాలి.. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత బీహార్ లాలూ..
T20 World Cup 2021, ENG vs BAN: బంగ్లాదేశ్ సెమీస్ ఆశలు గల్లంతు..? 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం