AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lalu Prasad Yadav: సర్కార్‌ను గంగలో కలిపేయాలి.. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత బీహార్‌ లాలూ..

ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌. బీహార్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు లాలూ. తారాపూర్‌లో..

Lalu Prasad Yadav: సర్కార్‌ను గంగలో కలిపేయాలి.. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత బీహార్‌ లాలూ..
Lalu Prasad
Sanjay Kasula
|

Updated on: Oct 27, 2021 | 7:54 PM

Share

ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌. బీహార్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు లాలూ. తారాపూర్‌లో పార్టీ అభ్యర్ధికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌తో పాటు ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి బీజేపీతో జత కట్టిన నితీష్‌ ఇప్పుడు ముఖం చాటేశారని విమర్శించారు. దాణా కుంభకోణంలో జైలు పాలైన లాలూ ప్రసాద్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. కోలుకున్న తరువాత లాలూ తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేకుండానే ఆర్జేడీ పోటీ చేస్తోంది.

వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పొత్తు ఉండదని తేజస్వి యాదవ్‌ తాజాగా వ్యాఖ్యలు చేశారు. అయితే లాలూతో ఫోన్లో మాట్లాడారు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ. కాంగ్రెస్‌కు లాలూ చిరకాల మిత్రుడని , ఆయనతో స్నేహబంధం కొనసాగించాలని సోనియా పార్టీ నేతలకు స్పష్టం చేశారు. బీహార్‌ ప్రజలు నితీష్‌ ప్రభుత్వాన్ని త్వరలో గంగలో కలిపేస్తారని అన్నారు లాలూ.

తాను జైలులో ఉండడం తోనే నితీష్‌ దొంగదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని విమర్శించారు.తాను బయట ఉంటే నితీష్‌ సీఎం అయ్యే వాడు కాదన్నారు. బీహార్‌ ప్రజల దృష్టిలో తేజస్వియాదవ్‌ సీఎం అని వ్యాఖ్యానించారు లాలూ. 8 సీట్లలో తమ పార్టీ అభ్యర్ధులను నితీష్‌ కుట్రపూరితంగా ఓడించాడని ఆరోపించారు.

ఇప్పుడు బీహార్‌ ప్రజల తరపున పోరాడేందుకు తాను వచ్చినట్టు తెలిపారు. బీజేపీ దేశాన్ని అమ్మడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, పోర్టులను మోదీ ప్రభుత్వం అమ్మేస్తోందని మండిపడ్డారు లాలూ. దేశవ్యాప్తంగా బీసీ జనగణన చేపట్టాలని లాలూ మరోసారి డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి: MEIL: రెండు అంబులెన్సులు, డయాలసిస్ మిషన్ల అందజేత.. దాతృత్వం చాటుకున్న మేఘా డైరెక్టర్ సుధా రెడ్డి..

LPG Gas Prices: దీపావళికి ముందు సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధర