లాక్‌డౌన్ నిబంధనలను‌ ఉల్లంఘించి పార్టీ.. సీనియర్ నటి క్లారిటీ

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి విందు ఇచ్చారంటూ నటి అనితా రాజ్‌పై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేసినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.

లాక్‌డౌన్ నిబంధనలను‌ ఉల్లంఘించి పార్టీ.. సీనియర్ నటి క్లారిటీ
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2020 | 1:58 PM

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి విందు ఇచ్చారంటూ నటి అనితా రాజ్‌పై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేసినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందించారు. తాను పార్టీ ఇచ్చినట్లు వస్తోన్న వార్తలన్నీ అవాస్తవాలని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు అనిత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

నేను మా ఇంట్లో విందు ఇచ్చానని.. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి పలి హిల్స్‌లో వాకింగ్ చేశానని.. నాపై ఓ అనాధారిత రూమర్‌ సర్క్యూలేట్ అవుతోంది. ఇప్పుడు అదే న్యూస్‌గా మారింది. కానీ మేము నివసిస్తోన్న భవనం 13 రోజులుగా పోలీసుల కంట్రోల్‌లో ఉంది. బయటనుంచి లోపలికి, లోపలి నుంచి బయటికి ఎవ్వరికీ అనుమతి లేదు. ఇంతవరకు నేను బయటికి వెళ్లిందే లేదు. మాకు కావాల్సిన సరుకులు కూడా ఇక్కడికే వచ్చి ఇస్తున్నారు. అందుకే బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా రాలేదు. ఈ సమయంలో కచ్చితమైన వార్తలను ప్రసారం చేయాలని కోరుతున్నా అని అనిత కామెంట్ చేశారు.

కాగా అనిత పార్టీ ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. ఆ తరువాత అనిత మాట్లాడుతూ.. నిజానికి చెప్పాలంటే మా ఆయన ఓ వైద్యుడు. ఆయన స్నేహితుడొకరు ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దాంతో అతడు మా ఇంటికి వచ్చారు. ఆయన భార్య తోడుగా వచ్చింది. అదే జరిగింది. ఎవరో పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇంట్లోని పరిస్థితిని పరిశీలించిన పోలీసులు.. ఆ తరువాత మాకు క్షమాపణలు చెప్పి వెళ్లారు అని పేర్కొన్నారు.

Read This Story Also: మహేష్‌ అలా పిలుస్తుంటే ఇబ్బందిగా ఉండేది: అల్లరి నరేష్‌