అభిమానులకు ఆ విషయం చెప్తూ.. సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రేణూ

టాలీవుడ్ నటి, రేణూ దేశాయ్.. తన సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. తాను సోషల్ మీడియాలో కేవలం ఇన్‌స్టాగ్రామ్‌నే వాడతానని.. తనకు వేరే అకౌంట్లు ఏం లేవని తెలిపింది. అంతేకాదు.. ఈ మధ్య సోషల్ మీడియాపై ఎక్కువ సమయం కేటాయిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌కు అడిక్ట్ అవుతున్నానంటూ పోస్ట్ చేసింది. అందుకే కొద్ది రోజులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. మళ్లీ వారం తర్వాత తిరిగి వస్తానంటూ పోస్ట్‌లో […]

అభిమానులకు ఆ విషయం చెప్తూ.. సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రేణూ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 17, 2019 | 12:59 PM

టాలీవుడ్ నటి, రేణూ దేశాయ్.. తన సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. తాను సోషల్ మీడియాలో కేవలం ఇన్‌స్టాగ్రామ్‌నే వాడతానని.. తనకు వేరే అకౌంట్లు ఏం లేవని తెలిపింది. అంతేకాదు.. ఈ మధ్య సోషల్ మీడియాపై ఎక్కువ సమయం కేటాయిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌కు అడిక్ట్ అవుతున్నానంటూ పోస్ట్ చేసింది. అందుకే కొద్ది రోజులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. మళ్లీ వారం తర్వాత తిరిగి వస్తానంటూ పోస్ట్‌లో పేర్కొంది. అంతేకాదు.. అదే పోస్ట్‌లో తన అభిమానులకు ఓ సందేశాన్ని కూడా తెలిపింది. వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండని… నీటిని వృథా చేయకుండా సంరక్షించండంటూ అదే పోస్ట్‌లో పేర్కంది.

బద్రి’, ‘జానీ’ సినిమాల్లో రేణూ దేశాయ్‌ నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె తెలుగులో వచ్చిన పలు సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కూడా పనిచేశారు. అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రేణూ.. బుల్లితెరలో ప్రసారమైన కొన్ని రియాల్టీ షోలకు జడ్జ్‌గా కూడా వ్యవహరించారు. కాగా, రైతుల నేపథ్యంలో తెరకెక్కించే ఓ సినిమాకు రేణూ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

. Ohh @instagram why you so awesomely addictive???

A post shared by renu desai (@renuudesai) on