
ఒక చిన్న కన్ను గీటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది అందాల తార ప్రియా ప్రకాశ్ వారియర్. ఓరు ఆదర్ లవ్’ చిత్రంలో ఒకే ఒక సీన్‌తో యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకుందీ మలయాళ బ్యూటీ. ఈ సినిమాలో ఓ పాటలో కన్నుకొట్టే సెకండ్ల నిడివి గల వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్‌గా మారింది. క్షణాల్లో దేశ వ్యాప్తంగా ఈ వీడియో చేసిన హంగామా ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రియా ప్రకాశ్ వల్లే ఈ సినిమా క్రేజ్ పెరిగిందని చెప్పంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ క్రేజ్‌తో ప్రియా వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని భాషల్లో వరుస సినిమా అవకాశాలు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మడికి అదృష్టం పెద్దగా కలిసిరాలేదని చెప్పాలి. ఈ బ్యూటీ నటించిన ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. ఈ క్రమంలోనే తన కెరీర్ అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరకు హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు తాజాగా చీర కట్టులో మెస్మరైజ్ చేసింది. బ్లూ కలర్ శారీలో ధగ ధగమనే నగలతో బాపుగారి బొమ్మలా కనువిందు చేసింది. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ప్రియా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..