మమ్మల్ని మెప్పించినవారికే సర్‌ప్రైజ్ అంటున్న అక్కినేని యువజంట

పెళ్లయ్యాక నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం మజిలీ. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా సమంత, నాగచైతన్య అభిమానులకు ఓ టాస్క్ ఇచ్చారు. సినిమాలోని తమ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ఈ పోస్టర్‌ను డిజైన్ చేస్తున్నప్పుడు మేం చాలా ఎంజాయ్ చేశామన్నారు సమయంత. ఐతే మీరు కూడా మీ లైఫ్ పార్ట్‌నర్ తో కలిసి… ఇలాంటి పోస్టర్‌నే డిజైన్ చేయండి అంటూ అభిమానులను కోరారు. ఎవరి పోస్టర్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:08 am, Wed, 6 March 19
మమ్మల్ని మెప్పించినవారికే సర్‌ప్రైజ్ అంటున్న అక్కినేని యువజంట

పెళ్లయ్యాక నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం మజిలీ. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా సమంత, నాగచైతన్య అభిమానులకు ఓ టాస్క్ ఇచ్చారు. సినిమాలోని తమ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ఈ పోస్టర్‌ను డిజైన్ చేస్తున్నప్పుడు మేం చాలా ఎంజాయ్ చేశామన్నారు సమయంత. ఐతే మీరు కూడా మీ లైఫ్ పార్ట్‌నర్ తో కలిసి… ఇలాంటి పోస్టర్‌నే డిజైన్ చేయండి అంటూ అభిమానులను కోరారు.

ఎవరి పోస్టర్ తమని మెప్పిస్తుంతో వారికి ఓ ఫన్నీ సర్‌ప్రైజ్ ఇస్తామని చెప్పింది సమంత. ఐతే ఈ టాస్క్‌ ప్రశాంత్ అనే వ్యక్తి గెలిచారు. తన భార్యతో కలిసి మజిలీ పోస్టర్‌ను డిజైన్ చేసి నాగచైతన్య, సమంతలకు ట్యాగ్ చేశారు. మజిలీ పోస్టర్ ఫర్‌ఫెక్ట్‌గా ఉందంటూ చై, సామ్‌లు ఆ జంటను మెచ్చుకున్నారు. ఐతే ఈ మజిలీ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.