AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు అనుకున్నా.. కానీ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది

దేవి సినిమా హీరో షిజు తన సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని, దేవి సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. 25 ఏళ్లు గడిచినా, ఆ సినిమాపై తెలుగు ప్రేక్షకులు చూపిన అభిమానం మర్చిపోలేనిదని తెలిపారు. షూటింగ్ సమయంలో ఎదురైన ప్రమాదాలు, సవాళ్లు, తెలుగు చిత్రసీమలో తనకు లభించిన ప్రోత్సాహం గురించి షిజు వివరించారు.

ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు అనుకున్నా.. కానీ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది
Movie
Rajeev Rayala
|

Updated on: Jul 11, 2026 | 1:18 PM

Share

1999లో విడుదలైన దేవి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో షిజు. ఆతర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించారు ఆయన. కాగా ఇటీవల జరిగిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని, దేవి సినిమా షూటింగ్ అనుభవాలను షిజు పంచుకున్నారు. సినిమా విడుదలై పాతికేళ్లు దాటినా, తన ఇప్పటికీ అలానే ఉండటానికి రహస్యం టెన్షన్ లేకుండా జీవించడమే అని షిజు తెలిపారు. మలయాళీ అయినా, తెలుగు భాషపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని, ఇప్పటివరకు 90కి పైగా తెలుగు చిత్రాల్లో నటించానని షిజు తెలిపారు. తన కెరీర్‌లో 60-70 శాతం చిత్రాలు వంద రోజులు ఆడటం తనకు లభించిన అదృష్టంగా ఆయన భావిస్తారు. మాతృభాష అయిన మలయాళంలోనూ సినిమాలు చేసినప్పటికీ, తెలుగు సినీ పరిశ్రమ తనకు విభిన్నమైన పాత్రలను అందించి, తన నటనను పూర్తిస్థాయిలో వినియోగించుకుందని షిజు అన్నారు. వికటకవి చిత్రంలో 90 ఏళ్ల వృద్ధుడి పాత్ర తనకు తెలుగులోనే లభించిందని, తమ సొంత రాష్ట్రాల్లో కంటే పక్క రాష్ట్రాల్లోనే కళాకారులకు ఎక్కువ గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులు కళాకారులను అత్యంత గౌరవిస్తారని, వారి ప్రేమ మర్యాదలు తనకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని షిజు అన్నారు.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్‌లు

దేవి సినిమా తనకు పెద్ద గుర్తింపును ఇచ్చిందని, ఇప్పటికీ ఎక్కడ కనిపించినా ప్రజలు తనను దేవి సినిమా హీరోగానే గుర్తుపడతారని షిజు ఆనందం వ్యక్తం చేశారు. అయితే, ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని తాను మొదట్లో ఊహించలేదని చెప్పారు. మలయాళీ ప్రేక్షకులు అలాంటి భక్తిరస చిత్రాలను ఆ సమయంలో ఆదరించేవారు కాదని, కాబట్టి దేవి విజయంపై తనకు సందేహాలు ఉండేవని అన్నారు. దేవి సినిమా చిత్రీకరణ మూడు సంవత్సరాలు పట్టిందని, అప్పట్లో గ్రాఫిక్స్ చేయడం చాలా కష్టమైన పని అని షిజు గుర్తు చేసుకున్నారు. ఒక షాట్ తీయడానికి కూడా చాలా సమయం పట్టేదని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!

ప్రివ్యూ చూసినప్పుడు తనకు వ్యక్తిగతంగా సినిమా నచ్చలేదని, దేవుడు, పాములు వంటి అంశాలు ప్రజలు ఆదరిస్తారని తను అనుకోలేదని షిజు తెలిపారు. అందుకే సినిమా హిట్టయిన విషయం కూడా తనకు చాలా కాలం తెలియదని, రఘువర్ధన్ వచ్చి చెప్పిన తర్వాతే తనకు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. దేవి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ప్రమాదకరమైన సంఘటనలను షిజు ప్రస్తావించారు. కులుమనాలిలో క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నప్పుడు మంచులో ప్రమాదవశాత్తు 20 అడుగుల లోయలోకి పడిపోయానని, ఒక చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని తెలిపారు. అలాగే, పాములతో చేసిన సన్నివేశాల చిత్రీకరణలో నిజమైన పాములను వాడారని, ఒక పాములవాడు పాముకాటుకు గురై విశాఖపట్నంలో మరణించాడని షిజు గుర్తుచేసుకున్నారు. తన జాతకంలోనో ఏమో తెలియదు కానీ, దేవి తర్వాత చిరంజీవి, రవితేజ వంటి హీరోల చిత్రాల్లో కూడా తనకు పాములతో కూడిన పాత్రలే వచ్చాయని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి : Bigg Boss 10 : నన్ను బిగ్ బాస్‌కు పంపండి.. నా టాలెంట్ ఏంటో చూపిస్తా..! బషీర్ మాస్టర్ వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us