ఎట్టకేలకు లెనిన్‌తో హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే
10 July 2026
Pic credit - Instagram
Rajeev
అందాల భామ భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు కుర్రాళ్ల కొత్త నేషనల్ క్రష్ ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య మాస్ మహరాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అమ్మడు. తొలి చిత్రంలోనే గ్లామర్ షోతోపాటు అభినయంతో కట్టిపడేసింది.
కానీ ఫస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో ఆమెకు పెద్దగా హెల్ప్ కాలేదు. అయితే తెలుగులో నెమ్మదిగా ఆఫర్స్ మాత్రం అందుకుంది.
మిస్టర్ బచ్చన్ తర్వాత ఈ అమ్మడు నటించిన కింగ్డమ్ సినిమా విడుదలైంది. గతఏడాది జూలై 31న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాఅంతగా ఆకట్టుకోలేకపోయింది.
రామ్ పోతినేని సరసన సినిమా చేసింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అలాగే దుల్కర్ సల్మాన పక్కన కాంత అనే చిత్రంలో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది.
ఇక ఎట్టకేలకు లెనిన్ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హిట్ అందుకుంది. వ్ ఆరుసా ఫ్లాప్స్ తో వెనకబడ్డ ఈ చిన్నది ఇప్పుడు లెనిన్ సినిమాతో తిరిగి ట్రాక్ లోకి వచ్చింది.
ఈ సినిమా తర్వాత మరోసారి భాగ్యశ్రీ బోర్సే వరుసగా ఆఫర్స్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..