AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాడు చేసిన ఎదవ పని వల్ల మమల్ని అడగటం మొదలుపెట్టారు.. అసలు విషయం చెప్పిన ,మహేష్ విట్ట

మహేష్ విట్టా తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించి మెప్పించాడు. ప్రస్తతం సినిమాలు తగ్గించాడు మహేష్.. సినిమాలతో పాటు జబర్దస్త్ లోనూ నవ్వులు పూయించాడు మహేష్. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన తన సినీ ప్రయాణం, చిత్ర నిర్మాణ సవాళ్లు, వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

వాడు చేసిన ఎదవ పని వల్ల మమల్ని అడగటం మొదలుపెట్టారు.. అసలు విషయం చెప్పిన ,మహేష్ విట్ట
Mahesh Vitta
Rajeev Rayala
|

Updated on: Jul 11, 2026 | 1:50 PM

Share

నటుడు మహేష్ విట్ట గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఫన్ బకెట్ షో ప్రస్థానం, అది ఎలా వచ్చింది, ఎదుర్కొన్న సవాళ్లు, ఫన్ బకెట్ భార్గవ్ ఎంట్రీ, ఆతర్వాత వచ్చిన వివాదాలపై క్లారిటీ ఇచ్చారు. మహేష్ విట్ట ఫన్ బకెట్ షో త్రిశూల్, హర్ష కొమ్మున, నేను.. మా ముగ్గురితో కలిసి ప్రారంభమైంది. ప్రారంభంలో, కేవలం 15 ఎపిసోడ్‌ల వరకు, ఈ షోకు పెద్దగా గుర్తింపు లభించలేదని, వ్యూస్ కూడా చాలా తక్కువగా ఉండేవని మహేష్ అన్నారు అయితే, 15వ ఎపిసోడ్ తర్వాత, ఫన్ బకెట్ అద్భుతమైన ప్రజాదరణ పొంది, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయం షోకు కొత్త కళాకారులను, అవకాశాలను తెచ్చిపెట్టిందని తెలిపారు. ఫన్ బకెట్ భార్గవ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ, భార్గవ్ మధురానగర్‌లో హాస్టల్‌లో ఉన్నప్పుడు, ఒక ఆఫీసు సిబ్బంది సలహా మేరకు తన స్నేహితుడు భరత్ బెహరాతో కలిసి ఫన్ బకెట్ ఆఫీస్‌కు వచ్చేవాడని తెలిపారు. మొదట, జోకులు ఫుల్ చేయడానికి, స్టోరీలో ఖాళీఉంటే భార్గవ్‌కు అవకాశం ఇవ్వగా, అతను క్రమంగా టీంలో భాగమయ్యాడని, తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని విట్ట తెలిపారు.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్‌లు

అయితే జబర్దస్త్ లేదా బిగ్ బాస్ వంటి షోల మాదిరిగా ఫన్ బకెట్ కూడా సుమారు 15-20 మంది కళాకారులకు గుర్తింపు, అవకాశాలను కల్పించిందని విట్ట గుర్తు చేశారు. ఆ షో డైరెక్టర్ కానీ,  టీం సభ్యులు ఎవరూ తమ పేరు ముందు ఫన్ బకెట్ అని పెట్టుకోలేదని, కానీ భార్గవ్ ఒక్కడే ఆ పేరును ఉపయోగించుకున్నాడని మహేష్ అన్నారు. ఆతర్వాత భార్గవ్ వ్యక్తిగత విషయాలు వార్తల్లో నిలవడంతో, ఫన్ బకెట్ టీమ్ ను ప్రశ్నించడం మొదలైందని విట్ట పేర్కొన్నారు. అతను ఓ ఎదవ పని చేయడంతో ఫన్ బకెట్ టీమ్ పై ప్రభావం పడిందని మహేష్ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!

ఫన్ బకెట్ ఆగిపోవడం వెనుక గల కారణాలను కూడా మహేష్ విట్ట వెల్లడించారు. ప్రధానంగా, కంటెంట్ కొరత, కొత్త జోకులు రాయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. అలాగే, మహేష్ విట్టతో సహా చాలా మంది కళాకారులకు సినిమాల్లో అవకాశాలు రావడంతో వారు షో నుంచి తప్పుకున్నారు. దర్శకుడు కూడా రన్ రాజా రన్ వంటి చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసి, కుటుంబ సమస్యల వల్ల తిరిగి వచ్చారని, ఆయనకు కూడా సినిమా దర్శకుడిగా ఎదగాలనే లక్ష్యం ఉందని విట్ట తెలిపారు. ఈ కారణాల వల్ల ఫన్ బకెట్ 100 ఎపిసోడ్‌ల తర్వాత అధికారికంగా నిలిపివేయబడిందని, అయితే వేరేవాళ్లు దాన్ని తీసుకొని మొత్తం 240 ఎపిసోడ్‌ల వరకు కొనసాగించారని మహేష్ విట్ట చెప్పుకొచ్చాడు. ఇక ఫన్ బకెట్ భార్గవ్ చేసిన ఓ పని వల్ల 20ఏళ్లు జైలు శిక్ష పడింది. ఇటీవలే తన తల్లి చనిపోతే చూడటానికి వచ్చాడు ఫన్ బకెట్ భార్గవ్.. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇది కూడా చదవండి : Bigg Boss 10 : నన్ను బిగ్ బాస్‌కు పంపండి.. నా టాలెంట్ ఏంటో చూపిస్తా..! బషీర్ మాస్టర్ వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us